అంతర్జాతీయం

వీసా ఫీజు రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ఐటి కంపెనీలపై అమెరికా బాదుడు
ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు ఓటింగ్

వాషింగ్టన్, డిసెంబర్ 17: భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ హెచ్-1బి, ఎల్-1 వీసాలపై విధించే ప్రత్యేక ఫీజును రెట్టింపు చేయాలని అమెరికా నిర్ణయించింది. 9/11 హెల్త్‌కేర్ చట్టానికి, బయో మెట్రిక్ ట్రాకింగ్ సిస్టమ్‌కు నిధులను సమకూర్చడం కోసం హెచ్-1బి వీసాపై ఫీజును 4 వేల డాలర్లకు, ఎల్-1 వీసాపై ఫీజును 4500 డాలర్లకు పెంచాలని నిర్ణయించింది. బుధవారం 1.1 లక్షల కోట్ల డాలర్ల ద్రవ్య వినిమయ బిల్లును అంగీకరించిన అమెరికా కాంగ్రెస్ నేతలు హెచ్-1బి వీసాలకు చెందిన కొన్ని కేటగిరీలపై ప్రత్యేక ఫీజును 4 వేల డాలర్లకు, ఎల్-1 వీసాపై ఫీజును 4500 డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ శుక్రవారం జరగనుంది.
ప్రత్యేక ఫీజు ద్వారా లభించే సొమ్ము ఏడాదికి వందకోట్ల డాలర్లకు పైగానే ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సొమ్మును 9/11 దాడుల బాధితుల( ఫస్ట్ రెస్పాండెంట్స్) ఆరోగ్య పరీక్షలు, చికిత్సల కోసం ఉపయోగిస్తారు. ద్రవ్య వినిమయ బిల్లులో ఈ ప్రత్యేక ఫీజుకు సంబంధించిన నిబంధనలు ప్రత్యేకించి భారతీయ ఐటి కంపెనీల గురించి ప్రస్తావించనప్పటికీ బిల్లులోని భాష మాత్రం భారతీయ ఐటి కంపెనీలపైనే ఎక్కువ భారం పడే విధంగా ఉంది. తమ ఉద్యోగుల్లో 50 శాతం హెచ్-1బి, ఎల్-1 వీసాలపై ఉన్న కంపెనీలపై ఈ ప్రత్యేక ఫీజు విధిస్తారు. 2010నుంచి అయిదేళ్ల పాటు హెచ్ -1బి వీసాలపై 2 వేల డాలర్ల ప్రత్యక ఫీజు విధించడానికి ఉద్దేశించిన గత నిబంధన ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసింది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఈ అంశాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వద్ద ప్రస్తావించారు కూడా. పారిస్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందాన్ని సాధించడంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలపడం కోసం ఒబామా ఫోన్ చేసినప్పుడు హెచ్-1బి, ఎల్-1 వీసాలకు సంబంధించి ప్రతిపాదించిన బిల్లు పట్ల భారతీయ ఐటి కంపెనీలు ఆందోళనను మోదీ వివరించారని పిఎంవో కార్యాలయం తెలియజేసింది.