విశాఖ

నిరసనలతో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: నిరసన ప్రదర్శనలతో శుక్రవారం సాయంత్రం విశాఖ నగరం హోరెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ప్రత్యక్ష పోరాటంలో భాగంగా చేపట్టిన ‘్ధర్మపోరాట దీక్ష’కు సంఘీభావంగా టీడీపీ ఒక రోజు నిరసన ప్రదర్శన చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ దీక్షలు కొనసాగాయి. ఆయా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, పలు చోట్ల మంత్రులు సంఘీభావ దీక్షల్లో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబంపై రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్న మీడియా దాడిపై జనసేన కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇదే సందర్భంలో విజయవాడ చంద్రబాబు దీక్షలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆశీల్‌మెట్ట వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవీఎంసీ వద్ద జనసేన, బీజేవైఎం ప్రదర్శనతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన, బీజేవైఎం ధర్నాల్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరెత్తాయి.

టీడీపీ అనుకూల మీడియాను బహిష్కరిస్తాం
* జనసేన కార్యకర్తల ధర్నా
రాజకీయంగా దెబ్బతీసే చర్యల్లో భాగంగా టీడీపీ అనుకూల మీడియా ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అసత్య కథనాలను ప్రచారం చేయడం అత్యంత హేయమైన చర్యగా జనసేన కార్యకర్తలు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు నడచుకునే అనుకూల మీడియా వైఖరిపై కార్యకర్తలు మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెళ్లలో ప్రసారమవుతున్న పవన్ కల్యాణ్, ఆయన కుటుంబీకులపై వ్యతిరేక కథనాలకు పరోక్షంగా చంద్రబాబు అండ్ కో మద్దతు ఉందంటూ కార్యకర్తలు నినదించారు. ఈక్రమంలో చంద్రబాబు పవన్ కల్యాణ్ కుటుంబీకులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తమకు వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్న పలు ఛానెళ్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆయ మీడియా ఛానెళ్ల తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సంస్థల లోగోలతో కూడిన బ్యానర్లను ప్రదర్శిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వరకూ ఊరేగింపుగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు ముఖ్యమంత్రికి, మీడియా ఛానెళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

* తెలుగునాడు విద్యార్థితో బీజేవైఎం వాగ్వాదం
* పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలంటూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో ఆశీల్‌మెట్ట కూడలిలో ధర్నా నిర్వహించారు. ఉన్నత మైన పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత ధూషణలకు పాల్పడిన బాలకృష్ణ తెలుగు ప్రజల మంచి తనాన్ని మంటగలిపారని బీజేవైఎం ధ్వజమెత్తింది. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన బాలకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేవైఎం యత్నించింది. ఇదే సందర్భంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) బీజేవైఎం యత్నాన్ని అడ్డుకునే యత్నం చేసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేసే యత్నాలను పోలీసులు అడ్డుకుని బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పంపివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే ధర్నా జరుగుతున్నంత సేపు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.