విశాఖ

ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, నవంబర్ 16: మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అందరూ కృషి చేయాలని వైద్యాధికారి తిరుపతిరావు కోరారు. స్థానిక ఆసుపత్రిలో అభివృద్ధి కమిటి సభ్యులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సంవత్సర కాలంలో ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధిని చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో దంత వైద్యుడు, ఫార్మాసిస్టు వంటి పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు. ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ తీర్మానం చేసారు. ఆసుపత్రి అభివృద్ధికి అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు. త్వరలో అన్నిరకాల శస్త్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వైస్. ఎం.పి.పి. పి.వెంకటరావు, అభివృద్ధి కమిటి సభ్యులు వేమవరపు రామధర్మజ, కరణం వెంకటేష్, జి.అచ్చుతం, తుడుం శాంతి తదితరులు పాల్గొన్నారు.

గ్రంధాలయ వారోత్సవాలు
మాడుగుల, నవంబర్ 16: గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం మాడుగుల, కె.జె.పురం గ్రంధాలయాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వారోత్సవాల మూడో రోజు గ్రంధాలయ అధికారులు వై.వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన, వ్యాసరచన పోటీలను నిర్వహించి, గ్రంధాలయ విశిష్టతను తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసిత నిరుద్యోగులంతా సంఘటితంగా ఉద్యమించాలి

మాకవరపాలెం, నవంబర్ 16: ఉపాధి కల్పన కోసం నిర్వాసిత నిరుద్యోగులంతా సంఘటితంగా ఉద్యమించాలని భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వైసీపీ సీనియర్ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు అన్నారు. మండలంలోని రాచపల్లి పరిసర ప్రాంత నిరుద్యోగులంతా స