విశాఖ

ఎస్.టి., ఎస్.సి.లకు ఉచిత విద్యుత్ కనెక్షన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 16: దారిద్ర రేఖకు దిగువనున్న ఎస్.టి., ఎస్.సి. కుటుంభాలకు ఉచితంగా విద్యుత్ కనక్షన్‌లు ఇస్తున్నట్టు స్థానిక తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ కోడి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గ్రామీణ సౌభాగ్య అభియాన్ పథకం కింద పేదలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద ఇంతవరకు 250 మందికి విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. అరకులోయ, డుంబ్రిగుడ మండలాలకు చెందిన మరో వెయ్యి 172 మందికి ఉచిత విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వాల్సి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇటీవల తమ సిబ్బందితో చేసిన సర్వేలో వీరంతా ఉచిత విద్యుత్ కనెక్షన్‌లకు అర్హులని గుర్తించామని ఆయన అన్నారు. గతంలో 125 రూపాయలకే విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చేవారమని, గ్రామీణ సౌభాగ్య శ్రీ అభియాన్ పథకం అమలులోకి వచ్చిన తరువాత గిరిజన, హరిజనులకు ఎటువంటి వ్యయం లేకుండా ఉచితంగా కనెక్షన్‌లు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గిరిజనులకు ఎటువంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి వంద యూనిట్లు పైబడి విద్యుత్‌ను వాడితేనే బిల్లులు చెల్లించాలని ఆయన సూచించారు. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో 14 వేల రెండు వందల మంది విద్యుత్ వినియోగదారులు వంద యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. లోవోల్టేజిని ఎదుర్కొంటున్న వినియోగదారులు తమకు సమచారం అందిస్తే ఆయా ప్రాంతాలలో నూతన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని, విద్యుత్ స్థంబాలు ప్రమాదకరంగా మారినా మార్పు చేస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు.

===================================================

ఉద్యమకారులకు నివాళి
అరకులోయ, నవంబర్ 16: స్థానిక శాఖా గ్రంధాలయంలో గ్రంధాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంధాలయ ఉద్యమ నాయకుడు గాడిచర్ల హరిసర్వత్తమరావులకు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. 51వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా మూడో రోజు వీరి చిత్ర పటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్థానిక శాఖా గ్రంధాలయ అధికారి జి.మురళీక్రిష్ణ మాట్లాడుతూ 1986లో విశాఖపట్నంలో మంతిన సత్యనారాయణమూర్తి తొలి పౌర గ్రంధాలయాన్ని నెలకొల్పారని చెప్పారు. ఆంగ్ల భాష, సంస్కృతిల ప్రభావం, ఇతర దేశాలలోని గ్రంధాలయాలకు సంబంధించిన సమాచారం ఆంధ్రులకు లేకపోయినా స్వంత ప్రేరణపై సత్యనారాయణమూర్తి గ్రంధాలయాన్ని స్థాపించినట్టు ఆయన పేర్కొన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, పుస్తక పఠనాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

=================================================

మంత్రి పర్యటనకు ఏర్పాట్లు
అరకులోయ, నవంబర్ 16: రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు తెలుగుదేశం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత తొలిసారిగా ఈ ప్రాంతానికి ఈ నెల 18వ తేది ఆదివారం విచ్చేస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అరకులోయ ముఖ ద్వారం నుంచి ప్రధాన రహదారి మీదుగా క్యాంపు కార్యాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించాలని శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా క్యాంపు కార్యాలయం వద్ద దివంగత ఎమ్మెల్యే సర్వేశ్వరరావు చిత్ర పటానికి నివాళి అర్పించనున్నారు. మంత్రి పర్యటనలో ఒక ప్రయివేట్ కార్యక్రమంలో కూడా పాల్గొననున్నట్టు దేశం నాయకులు తెలిపారు.

==================================================

20న ఎ.ఒ.బి. బంద్
పాడేరు, నవంబర్ 16: ఓడిస్సాలోని మల్కనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల 20వ తేదిన ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంత బంద్‌ను నిర్వహిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ఎ.ఒ.బి. స్పెషల్ జోనల్ కమిటి అధికార ప్రతినిధి జగబంధు తెలిపారు. శుక్రవారం స్థానిక విలేఖరులకు పంపిన ఒక ప్రకటనలో కేంద్రంలో మోడి, రాష్ట్రంలో చంద్రబాబు, ఒడిస్సాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బి.జె.పి. ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు దోపిడీ విధానాలను అడ్డుకుంటున్న మావోయిస్టు పార్టీని లక్ష్యంగా చేసుకుని కుతంత్రాలతో పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రీన్‌హంట్ పేరిట ప్రణాళికను తయారు చేసి హంతక పోలీసులను ఆదివాసులపై ఉసిగొల్పుతున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోడి పాలనలో నల్లదనం రద్దు కాకపోగా మరింత పెరిగిపోయిందని, నిత్యం ధరలు పెరుగుతూ సామాన్యుల జీవితాలు అల్లకల్లోలంగా మారాయని ఆయన విమర్శించారు. సామ్రాజ్యవాదులకు, దళారీ కంపెనీలకు బొగ్గు, మాంగనీసు, మైకా, బాక్సైట్, వంటి సహజ వనరులను కట్టబెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నారని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో ప్రజలకు మందులు లేక, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలకులకు పట్టదని ఆయన విమర్శించారు. ప్రభుత్వాల నిరంకుశత్వాన్ని, దోపిడి పాలనను నిరసిస్తూ తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని జగబంధు కోరారు.