విశాఖ

ఘనంగా జాతీయ పత్రికా వ్యవసాథపక దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, నవంబర్ 16: జాతీయ పత్రికా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీలేరులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈకార్యక్రమాన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసారు. దీనికి ముఖ్యఅతిధిలుగా ఎడీ ఇ పాపరావు, ఎ ఇ చలపతిరావు పాల్గొన్నారు. కార్యక్రమాన్న ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు అలుపెరగకుండా పని చేస్తారన్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరదేశి, టీడీపీ మండల కార్యదర్శి తిరులమరావు, పీసీసీ కార్యదర్శి శ్రీనివాసరావు, చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పాపారావు, యాసబ్ తెలిపారు.

సమస్యల పరిష్కారానికే గ్రామదర్శిని

మాకవరపాలెం, నవంబర్ 16: గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటు చేసిందని, దీనిని గ్రామస్తులంతా సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని భీమబోయినపాలెం పంచాయతీ శివారు చింతలూరులో అధికారులు గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు గ్రామంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో మాజీ సర్పంచ్ తలుపులయ్య మాట్లాడుతూ గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిర్మించిన కల్వర్టుకు రక్షణ గోడలు నిర్మించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. దీనిపై ప్రత్యేకాధికారి మాట్లాడుతూ కల్వర్టు వద్ద రక్షణ గోడను తక్షణం నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ చిన్నయ్యమ్మ, ఎంపీడీ ఓ ఉదయశ్రీ, తహశీల్దార్ శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యను పరిరక్షించుకోవాలి
అనకాపల్లిటౌన్, నవంబర్ 16: హేతుబద్దీకరణ పేరుతో ప్రభుత్వం వేలాది పాఠశాల మూసివేతకు గురిచేస్తుందని ఫలితంగా రానున్న రోజుల్లో పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యదూరమయ్యే ప్రమాదం ఉందని ఉత్తరాంధ్ర నుండి ఎపిటిఎఫ్ తరుపున టీచర్స్ ఎంఎల్‌సిగా పోటీ చేయుచున్న పాకలపాటి రఘువర్మ అన్నారు. స్థానిక ఎఎంఎఎ హైస్కూల్‌లో ఆర్‌ఎంసిఎస్ శిక్షణా తరగతులు జరుగుతున్న నేపద్యంలో అక్కడకు హాజరైన రఘువర్మ ఉపాధ్యాయులను ఉద్దేశించి శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హేతుబద్దీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో మూతపడటం వలన ప్రైవేటు పాఠశాలలకు రెడ్‌కార్పెట్ పరిచినట్లేనని ఆయన అన్నారు. దీనిని ఎంతమాత్రం మనం వ్యతిరేఖించాల్సిన అవసరం ఉందన్నారు. రెండుదశాబ్ధాలుగా సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారం కాకుండా ఉందని దీనివలన టీచర్లు ప్రమోషన్‌లో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. ఎంఎల్‌సిగా తనకు ప్రధాన్యత ఇస్తే ఫెడరేషన్ లక్ష్యసాధనతో తాను ఉపాధ్యాయ సంక్షేమం కోసం విద్యారంగ ప్రగతికోసం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటపతిరాజు, ఉపాధ్యాయ సంపాదకులు శీలా జగన్నాధరావు, రాష్ట్ర కౌన్సిలర్లు వై శ్రీనివాసరావు, ఎన్ సన్యాశినాయుడు, ఎపిటిఎఫ్ అనకాపల్లి మండలశాఖ అధ్యక్షప్రధాన కార్యదర్శులు కెవిఎల్ గణేష్, గణేష్, నూకేశ్వరరావు, కశింకోట ఎపిటిఎఫ్ అధ్యక్షులు పి గణపతి, గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రంధాలయానికి పుస్తకాలు అందజేత
అనకాపల్లిటౌన్, నవంబర్ 16: జాతీయగ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ శాఖవీధిలో ఉన్న శాఖాగ్రంధాలయానికి సిద్దార్ధ సోషల్ సర్వీస్ అసోషియేషన్స్ అధ్యక్షులు బల్లా నాగభూషనం ఆధ్వర్యంలో పుస్తకాలను అందజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఆర్‌టిసి డిఎం ప్రవీణ పుస్తకాలను శుక్రవారం గ్రంధాలయానికి అందజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువకులు గ్రంధాలయాలకు వచ్చి అక్కడ ఉన్న పుస్తకాలను చదివి ప్రపంచంలోని తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చునని అన్నారు. తద్వారా యువత ఉద్యోగ అవకాశాలకు దోహదకలుగుతుందన్నారు. గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలు ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖా గ్రంధాలయం అధికారిణి కె సాయాదేవి, సంస్థ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి మల్లేశ్వరరావు, అల్లాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి జిల్లా కార్యవర్గం ఏర్పాటు
కశింకోట, నవంబర్ 16: భారతీయజనతాపార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నగంటి అప్పారావు శుక్రవారం జిల్లా కార్యవర్గంను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా ఎంఎం నాయుడు, ప్రధానకార్యదర్శిగా కొణతాల అప్పలరాజు, కార్యదర్శిగా ఉడా రమేష్, కోశాధికారిగా డాక్టర్ వి రామచంద్రరాజు, యువమోర్చ అధ్యక్షులుగా గల్లా రాజు, మహిళా మోర్చ అధ్యక్షులుగా మండల సంతోషి సుబ్బలక్ష్మీ, గిరిజన మోర్చ అధ్యక్షులుగా చల్లా రామకృష్ణ, ఎస్‌సి మోర్చ అధ్యక్షులుగా ఎ కొండబాబులను మరి కొంతమందిని ఈ కార్యవర్గంలో తీసుకోవడం జరిగిందని అధ్యక్షులు పొన్నగంటి అప్పారావు విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్బంగా అప్పారావు తాళ్లపాలెం బిజెపి కార్యాలయంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో బిజెపికి మంచి భవిషత్తు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని బిజెపి అభ్యర్థులు అత్యంత మెజార్టీతో గెలిపించి పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు.

భర్త కనిపించలేదని ఫిర్యాదు
అనకాపల్లిరూరల్, నవంబర్ 16: తన భర్త ఇంటి నుండి వెళ్లి 15రోజులు గడుస్తున్నా ఇంటికి రాలేదని, వెతికినా కనిపించలేదని శుక్రవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్.ఐ ఆదినారాయణ తెలిపిన వివరాలు ప్రకారం బద్ది శివ సుబ్రహ్మణ్యం (35) స్వస్థలం ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామం కాగా అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి చెందిన వరలక్ష్మీని గతకొనే్నళ్లు క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే ఎక్కువశాతం అత్తవారి ఇంటివద్దే భార్యతోపాటు ఉండేవాడు. గతనెల 28న సొంతూరు వెళ్లివస్తానని చెప్పివెళ్లి ఇప్పటి వరకు రాకపోవడంతో భార్య వరలక్ష్మీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్.ఐ ఆదినారాయణరెడ్డి కేసు నమోదు చేసారు.

మాతా శిశు మరణాల నివారణకు చర్యలు
పాడేరు, నవంబర్ 16: గిరిజన ప్రాంతంలో మాతా శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రసవాల సంఖ్యను పెంచి చిన్నారులకు కచ్చితమైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించడం ద్వారా మాతా శిశు మరణాలను అరికట్టవచ్చునని అన్నారు. ఆసుపత్రి ప్రసవాలపై గిరిజన గర్భిణీలకు అవగాహన కల్పించి ఆసుపత్రులలో ప్రసవాలను చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. గర్భిణీలకు నిరంతరం రక్త పరీక్షలు చేపట్టి హెమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించాలని, రక్త ప్రసరణ పరీక్షలు చేయాలని ఆయన చెప్పారు. ప్రసవ సమయానికి మూడు రోజులు ముందుగానే ఆసుపత్రులకు తరలించి వైద్యాధికారుల పర్యవేక్షణలో వారికి వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. ఏజెన్సీలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో గర్భవతుల అంచనా ప్రసవ తేదీలను పొందుపరచాలని ఆయన చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు మన్యంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీలో చంద్రన్న సంచార వాహనాల సేవలపై ఆయన ఆరా తీసారు. చంద్రన్న సంచార వాహనాల్లో తప్పనిసరిగా వైద్యులు ఉండాలని ఆయన చెప్పారు. హెచ్.ఐ.వి. రోగులకు ఐ.టి.డి.ఎ. ద్వారా అందిస్తున్న పోషకాహారం నిలుపుదల చేసారని సంబంధిత అధికారులు ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన ఆయన పౌష్టికాహార సరఫరాకు జి.సి.సి. అధికారులను బాలాజి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతిరావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి.రమేష్, జిల్లా క్షయ నివారణ అధికారి వసుంధర, డి.ఐ.ఒ. జీవనరాణి, డి.పి.ఒ. సూర్యనారాయణ, ఎపిడిమిక్ సెల్ అధికారి కల్యాణ ప్రసాద్, ఏజెన్సీ అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, సీనియర్ వైద్యాధికారి లీలాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

===================================================