విశాఖ

తహశీల్ధార్ ఆదేశాలతో నిలిచిపోయిన శ్మశానవాటిక పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, నవంబర్ 16: స్థానిక సాదుమఠం వద్ద ఉన్న శ్మశానవాటిక పనులు తహశీల్థార్ జ్ఞానవేణి ఆదేశాలతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకుని చందాలు దండుకుని నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్దమైన చర్య అని దీంతో ఆ పనులను నిలుపుదల చేసినట్లు తహశీల్థార్ జ్ఞానవేణి ఆంధ్రభూమికి తెలిపారు. గ్రామంలో ఎక్కడ పనులు జరిగినా తమకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో జరిగే ఎటువంటి పనులకైనా, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, చేసేది మంచిపని అయినా చందాలు వేసుకోవల్సిన అవసరం ఉండదని, ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతే అడిగే హక్కు ప్రజలకు ఉందన్నారు. అంతేతప్ప ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చట్టంను చేతిలోకి తీసుకుని ప్రవర్తిస్తే చర్యలు తప్పవని జ్ఞానవేణి స్పష్టం చేసారు.

పరిదేశమ్మ దేవాలయానికి విరాళం
చీడికాడ, నవంబర్ 16: మండలంలోని శిరిజాం గ్రామదేవత పరిదేశమ్మ దేవాలయ అభివృద్ధికి జెడ్‌పీటీసీ సభ్యురాలు పి. సత్యవతి తన స్వంతంగా రూ.10 వేల నగదును నిర్వాహకులకు శుక్రవారం అందజేసారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ ప్రజలు దైవభక్తిని పెంపొందించుకొని గ్రామాల్లో దేవాలయాలను అభివృద్ధి చేయాలని ఆమె కోరారు. ఆమె వెంట పి.వి.జి.కుమార్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

గ్రంధాలయంలో చిత్రలేఖన పోటీలు
కశింకోట, నవంబర్ 16: మండలంలోని తాళ్లపాలెం గ్రంధాలయంలో గ్రంధాలయాధికారి కాండ్రేగుల జగన్నాధం ఆధ్వర్యంలో శుక్రవారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. 51వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా పిక్నిక్‌స్పాట్ అను అంశంపై చిత్రలేఖన పోటీ జరిగింది. అలాగే సీనియర్స్‌కు సేవ్‌యర్త్ అను అంశంపైన జరిగింది. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్స్‌పాల్ ఎం మాణిక్యం, కె మాధవిలత, ఎం బ్రహ్మనందం పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రమైన కశింకోటలో గ్రంధాలయాధికారి ఎల్‌వి రమణ ఆధ్వర్యంలో మూడవ రోజు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ఉపాధ్యాయులు బి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలికితీయడానికి మానసికవికాశానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత శేషగిరి మాట్లాడుతూ వివిధ పాఠశాల్లో ఉన్న విద్యార్థులు స్నేహపూర్వకంగా కలిసేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. ఈ పోటీల్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బి గంగాధరరావు, పి గణపతి, కె శ్రీనివాసరావు, బి ప్రసాద్, చిరంజీవి, నిర్వాహకులు బొడ్డేడ వరహాసత్యనారాయణ, శిష్టి అప్పారావు, దొడ్డి ఈశ్వరరావు, వై రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీలకు ఉన్నత పదవులు

కోటవురట్ల, నవంబర్ 16: ముస్లిం మైనార్టీలను ఉన్నత పదవుల్లో నియమించి రాజకీయంగా తెలుగుదేశం ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చిందని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలిపారు. స్థానిక ముస్లిం మైనార్టీ మహిళలకు శుక్రవారం కోటవురట్లలో కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే నర్సీపట్నం, రేవుపోలవరం అర్ అండ్‌బి రహదారిలో తంగేడు వద్ద రెండు కోట్ల రూపాయలతో నిర్మించే వంతెనకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసారు. అనంతరం కుట్టు శిక్షణా కేంద్రంలో ఫ్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌కు 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 10 షాదీఖానాలను మంజూరు చేసామన్నారు. ముస్లిం మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలో భాగంగా స్థానిక ముస్లింవీధికి చెందిన 45 మంది మహిళలకు కట్టు శిక్షణ ఇచ్చి మిషన్లు ఉచితంగా అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు, ఎడీవో కళ్యాణి, దేశం నాయకులు వేచలపు జనార్ధన్, టీవీ సూర్యారావు, పినపాత్రుని బుర్రయ్యదొర తదితరులు పాల్గొన్నారు.