విశాఖ

ప్రజా సమస్యల పట్ల అధికారులు చొరవ చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీడికాడ, నవంబర్ 16: ప్రజాసమస్యల పట్ల అధికారులు చొరవ చూపాలని జెడ్‌పీటీసీ సభ్యురాలు పొలుపర్తి సత్యవతి కోరారు. మండలంలోని శిరిజాం గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో అధికారులతో కలసి పర్యటించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీయుపి పాఠశాలలో అమలవుతున్న మద్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమాన్ని అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించకుండా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఒ ఆర్.ఎం. గ్లాడ్స్, తహశీల్దార్ తారకేశ్వరి, హౌసింగ్ ఎ.ఇ. ఎస్.వి. రమణమూర్తి పాల్గొన్నారు.

మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మాట్లాడుతూ మండలంలో 60 శాతంవరకు వర్షాభావ పరిస్థితులవల్ల వరినాట్లు ఈ ఏడాది వేయలేదన్నారు. వరినాట్లు వేయక రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని రుద్రి కోరారు.

సమస్యల పరిష్కారం కోసమే గ్రామదర్శిని
ఎస్.రాయవరం, నవంబర్ 16: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసమే గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తే స్థానికంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని గుడివాడ గ్రామంలో గ్రామదర్శిని, గ్రామ వికాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రత్యేకాధికారి రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ గ్రామంలో పర్యటించినపుడు ఇచ్చిన హామీలపై జరుగుతున్న పనులను స్థానిక ప్రజలు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలోని మద్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఇఒఆర్‌డి కొండలరావు, గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అచ్యుతాపురం - అనకాపల్లి రోడ్డు విస్తరణకు అధికారులు పరిశీలన
మునగపాక, నవంబర్ 16: అచ్యుతాపురం- అనకాపల్లి రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం అధికారులు పరిశీలించారు. రోడ్డు విస్తరణ వంద అడుగులకే విస్తరించాలని స్థానికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఆర్‌అండ్‌బి డిఇ, శ్రీనివాసారావు, ఇరిగేషన్ డిఇ శ్రీనివాస్ స్థానిక తహశీల్థార్ ఆదిమహేశ్వరావు, చిట్రా కంపెనీ డైరక్టర్, ఇండ్రస్టీయల్ కోస్టాల్ కారిడార్ (విసిఇఇ) అధికారులు అబ్రహం సంతోష్ , వీర్రాజుతో పాటు రోడ్డు విస్తరణ బాదితులు పాల్గొన్నారు. ఈసందర్భంగా చిట్రి కంపెనీ డైరక్టర్ హాసిక్ హుస్సెన్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఎక్కడక్కడ వంతెనలు వేయాలి, కల్వర్టులు ఏర్పాటు చేయాలి, రోడ్డు విస్తరణలో ఎంతమేర రైతుల భూములు సేకరించాలి, ఎన్ని షాపులు, బిల్గింగ్‌లు తొలిగించాలి అనే అంశంపై గ్రామాల వారిగా త్వరలో సమావేశాలు పెట్టి రోడ్డు విస్తరణ భాదితులతో చర్చించడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డు విస్తరణ ఏర్పాటుకు సహాకారం అందించాలని ఆయన కోరారు. మూడు నెలల్లో పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగులాపల్లి ఎంపిటిసి మళ్ల నాగసన్యాసిరావు, మాజీ సర్పంచ్ యల్లపు వెంకట బాస్కరరావు, బివి రమణ, బొడ్డేడ సోమసుందరావు, పెంటకోట వెంకట్రావు, మొల్లేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శాశ్వత అభివృద్ధి పనులు చేయని ప్రజాప్రతినిధులను నిలదీయండి
కె.కోటపాడు, నవంబర్ 16: మండలంలో శాశ్వత అభివృద్ధి పనులు చేయలేని ప్రజాప్రతినిధులను పార్టీలను నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మండలంలోని పిండ్రంగి రామాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగపతిరావు మాట్లాడుతూ కె.కోటపాడు మండల కేంద్రంలోతాను అధికారంలో వున్నపుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల తెచ్చానని, ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు తీసుకురాలేదన్నారు. తన హయాంలో రూ.20 లక్షల నిధులతో ఎంతో మందికి ఉపాధి కల్పించే ఫ్యాషన్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తే ఈ పదేళ్లలో కనీసం దాన్ని విస్తరించి మరింత మందికి ఉపాధి కల్పించలేని విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉన్నాయంటే అది తన తండ్రి దివంగత ఎంపీపీ పూడి అప్పలనాయుడు ఉదారంగా ఇచ్చిన భూమితోనే సాధ్యమయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు జాగరపు రామునాయుడు, గొలగాన చిన్నయ్యతాత, లెక్కల చంద్రరావు, జూరెడ్డి అప్పలనాయుడు, జాగరపు సన్యాశినాయుడు, సింగంపల్లి రమణ, జాగరపు గంగునాయుడు, సన్యాశినాయుడు, మేడచర్ల ఎంపీటీసీ సభ్యులు పూడి నారాయణమూర్తి, పూడి కృష్ణంనాయుడు, పూడి ప్రకాశరావు పాల్గొన్నారు.

గ్రామాల సమస్యల పరిష్కారంలో అధికారులు కృషి చేయాలి
కె.కోటపాడు, నవంబర్ 16: గ్రామాల సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎంపీడీఒ చదరం సుబ్బలక్ష్మి కోరారు. శుక్రవారం ఆమె మండలంలోని ఆర్.వై. అగ్రహారం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని తహశీల్దార్ వి. పద్మావతితో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి, ప్రజల మన్ననలు పొందాలన్నారు. అంతకు ముందు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. వాటి పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి టి. మధుమూర్తి, మండల వ్యవసాయాధికారి కె.వి. రాంప్రసాద్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

భీమవరం పాఠశాలకు జాతీయ స్థాయి అవార్డు
ఎస్. రాయవరం, నవంబర్ 16: మండలంలోని భీమవరం మండల పరిషత్ పాఠశాలకు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యింది. ఆంధ్రప్రదేశ్ జన్మభూమి మరియు ప్రవాస భారతీయ బృందం వారి స్ఫూర్తి, సహకారంతో డిజైన్ ఫర్ ఛేంజ్-2018 అనే జాతీయ ప్రాజెక్ట్‌లో భాగస్వాములైన ఈ పాఠశాల విద్యార్థులతో కలసి ఉపాధ్యాయ బృందం చేపట్టిన పక్షి జాతి సంరక్షణ కొరకు పాఠశాల ఆవరణలో చేపట్టిన పక్షిశాలలకు ఎంపికయ్యింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా మూడువేల ప్రభుత్వ పాఠశాలలు పాలు పంచుకోగా, కేంద్రప్రభుత్వం 100 పాఠశాలలను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన ఏకైక పాఠశాల భీమవరం కావడం హర్షనీయం. భీమవరం మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మళ్ల శ్రీనివాస్, టి. కళ్యాణి, సహాయంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ పాఠశాల జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక కావడంపట్ల స్థానిక ఎం.ఇ.ఒ.తోపాటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేసారు.