విశాఖ

2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌దే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీడికాడ, నవంబర్ 19: 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌దే విజయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పి. సతీష్‌వర్మ అన్నారు. మండల కేంద్రమైన చీడికాడలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 101వ జయంతి వేడుకలు సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న సతీష్‌వర్మ మాట్లాడుతూ ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషిచేసారని కొనియాడారు. పేదరికాన్ని నిర్మూలించండి అనే కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టి పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు దొండా రాంబాబు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొడ్డు శ్రీనువాస్, కాంగ్రెస్ నాయకులు ఆవుగడ్డ కోటిపల్లినాయుడు, వేచలపురవి, బండారు ఎరుకునాయుడు, చీకటి పరదేశి, డి.కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఎస్.రాయవరం, నవంబర్ 19: నర్సీపట్నం డివిజన్ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని నర్సీపట్నం ఎఎస్పీ అరీఫ్ అహ్మద్ అన్నారు. ఎస్.రాయవరం మండల పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆయన తనిఖీలు చేసారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం హెచ్చరిక బోర్డుల ఏర్పాటుతోపాటు కూడలివద్ద సిగ్నల్ లైట్ల ఏర్పాటు, పెట్రోలింగ్ వాహనాల ఏర్పాటుతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. నక్కపల్లి సర్కిల్ పరిధిలోని ఈ ఏడాది కేసుల నమోదు తగ్గిందని, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని ఎఎస్పీ అన్నారు. ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను ఎఎస్పీ పరిశీలించారు. కేసుల నమోదు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర విషయాలపై స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నక్కపల్లి సిఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్‌ఐ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు
ఎస్.రాయవరం, నవంబర్ 19: కార్తీకమాసం రెండవ సోమవారంతోపాటు ఏకాదశి కావడంతో మండలంలోని పలు శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎస్.రాయవరంలోని బుర్రేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ఏకాహం నిర్వహించారు. పెదఉప్పలంలోని బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో దాతలు లక్షా పదివేల రూపాయలతో స్థానిక దాతలు ఇచ్చిన శివుని వెండి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గ్రామానికి చెందిన తిరువీధుల పేరయ్య దంపతులు స్థానిక ఆలయ అర్చకులకు ఈ విగ్రహాన్ని అందజేసారు. పెదగుమ్మలూరు, దార్లపూడి, చినగుమ్మలూరు, పెనుగొల్లు, లింగరాజుపాలెం తదితర గ్రామాల్లోని శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రంథాలయ వారోత్సవాల్లో ఇందిర జయంతి వేడుకలు
సబ్బవరం, నవంబర్ 19 : భారత ప్రధానిగా,అలీన దేశాల అధిపతిగా స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని స్థానిక ట్రాఫిక్ ఎస్‌ఐ దంతులూరి శ్రీనివాసరాజు అన్నారు. సోమవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడి శాఖాగ్రంథాయల వారోత్సవాల్లో భాగంగా ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే ఇందిరాగాంధీ భారత దేశ కీర్తిప్రతిష్టలను ఎంతో ఇనుమడింప చేశారని కొనియాడారు. ఈకార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్‌ఐ వై.నరసింహమూర్తి, లైబ్రేరియన్ పివి రమణ, ఎస్.్భస్కర్, ప్రసాద్, ఎస్ వరుణ్, వై.చందులు పాల్గొన్నారు.