విశాఖ

పేదల గుండెల్లో ఇందిరాకు సుస్థిర స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన, నవంబర్ 19: భారత రత్న మాజీ ప్రధాని దివాంగత ఇందిరా గాందీ అందించిన సుస్థిర పాలనలో అమలుచేసిన అనేక సంక్షేమ పథకాలు పలితంగా ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఉందని అనకాపల్లి నియోజకవర్గ కన్వీనర్ ఐఆర్ గంగాధర్ కొనియాడారు. ఇందీరాగాందీ 101వ జయంతి వేడుకలు సోమవారం స్థానిక నెహ్రూచౌక్ కూడలిలోపార్టీ కార్యకర్తలు నడుమ ఘనంగా నిర్వహించారు. ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.ముందుగా ఐఆర్ గంగాధర్ అధ్వర్యంలో పార్టీ నాయుకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయుకులు డివి కృష్ణారావు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. పట్టణ ప్రధాన మార్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించన అనంతరం నెహ్రూచౌక్ జంక్షన్ వద్దకు చేరుకొని ఇందిరా జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ భారత ప్రధానిగా ఇందిరాగాంధీ దేశాన్ని అభివృద్దిపధంలో నడిపిస్తున్న సమయంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచి అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి వారి గుండెల్లో చరగని ముద్రగా నిలిచిన మహిళ ఇందిరాగాంధీ అన్నారు. అటువంటి సమయంలో ఏర్పాటు వాదుల తూటాలకు ప్రాణాలు అర్పించి ఆవిడ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు.పట్టణ అధ్యక్షులు బోయిన భానుమూర్తి యాదవ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాలు నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. సుస్థిర పాలన కోసం ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో ఆమె ఎనలేని కృషి చేసారన్నారు. మండల పార్టీ అధ్యక్షులు వెలుగుల బాబూరావు మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అపాధ్యక్షులు తుట్టా రమణ, ప్రధాన కార్యదర్శి మొగలపల్లి సుబ్బారావు, జి గున్నబాబు, జి శేషు, ఎగ్గాడ భాస్కరరావు పార్టీ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
చీడికాడ, నవంబర్ 19: మండలంలో కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. మండలంలో ఎల్‌బి పట్నం, ఖండివరం, చీడికాడ, తురువోలు గ్రామాల్లో శివాలయాలు భక్తులు పూజలు చేసారు. మేజర్ పంచాయతీ కెజెపురం శివాలయం, రామాలయంలో భక్తులు పూజలు చేసారు. చీడికాడ వినాయకుని ఆలయం వద్ద కశింకోట కుటుంబీకుల ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు.