విశాఖ

అన్‌రాక్ ఫ్యాక్టరీ తెరిచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, నవంబర్ 19: అన్‌రాక్ కంపెనీ తెరిపించి నిర్వాసిత కుటుంబాల నిరుద్యోగులకు వెంటనే ఉపాధి కల్పించాలని భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం అద్యక్షుడు రుత్తల యర్రాపాత్రుడు డిమాండ్ చేసారు. ఈమేరకు సోమవారం తహశీల్దార్ వై.శ్రీనివాసరావుకు యర్రాపాత్రుడితో పాటు నిర్వాసిత నిరుద్యోగ యువకులంతా వినతి పత్రం అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్‌రాక్ కంపెనీకి భూ సేకరణ సమయంలో రెండు సెంట్లు భూమి, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని అప్పట్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారులు హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా పశుక్రాంతి పథకంలో పాడి గేదెలు, ఇళ్ళు, భూములు కోల్పోయిన వారికి ఏడు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అప్పట్లో నిర్వాసితులకు హామీ ఇచ్చి నేటికి 10 సంవత్సరాలు కావస్తున్నా నిర్వాసితుల సమస్యలపై ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని యెడల దీనిపై ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని నిర్వాసితుల తరుపున ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నిర్వాసితుల , నిరుద్యోగుల సంఘం సభ్యులు తాతాజీ, శ్రీను, నూకరాజు, దేముడు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
కొత్త లే అవుట్లకు టౌన్ ఫ్లానింగ్ అనుమతులు తప్పని సరి
మాకవరపాలెం, నవంబర్ 19: గ్రామీణ ప్రాంతాల్లో వేసే లే అవుట్లకు జిల్లా టౌన్ ఫ్లానింగ్ అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని టౌన్ ఫ్లానింగ్ జిల్లా అధికారి డి.గురవారావు అన్నారు. ఈమేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇటీవల అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారని వాటికి పంచాయతీ అనుమతితో జిల్లా టౌన్ ఫ్లానింగ్ కార్యాలయానికి నివేదికలు పంపిస్తే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో చోడవరం, దేవరాపల్లి ప్రాంతాల్లో నాలుగు అక్రమ లే అవుట్లును గుర్తించి నోటీసులు జారీ చేసామన్నారు. కొత్తగా లే అవుట్లు వేసే వారు 10 శాతం ఖాళీ స్థలాన్ని పంచాయతీకి అప్పగించాలన్నారు. లే అవుట్లలో 33 అడుగుల రోడ్లు , 40 అడుగుల అప్రోచ్ రోడ్లు తప్పని సరిగా చూపించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన లే అవుట్లను నిలుపుదల చేస్తామని ఈసందర్భంగా ఆయన లే అవుట్ల యజమానులకు తెలియజేసారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఇ ఓ పీ ఆర్‌డీ శివరామ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
కార్తీక ఏకాదశి శోభ
అనకాపల్లి టౌన్, వనంబర్ 19: కార్తీక మాసం రెండోవ సోమవారం, ఏకాదశి పర్వదిన సందర్బంగా పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు ఆలయాలు సోమవారం భక్తులతో కిక్కిరిసి కార్తీక శోభను సంతరించుకుంది.ఈ సందర్బంగా భక్తులు తెల్లవారిజామునుండి పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఆలయాలకు తరలివచ్చి క్యూలైనులలో బారులుదీదారు.స్థానిక గవరపాలెం భోగలింగేశ్వర స్వామి ఆలయం, దేమునిగుమ్మం, గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయాలు, సుంకరమెట్ట సత్యనారాయణ స్వామి, శారదానది సమీపంలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి, వెల్పులవీధి కాశీవిశే్వశ్వర, సత్యనారాయణ పురం కనకదుర్గమ్మ ఆలయం, హేమగిరి సత్యనారాయణ స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భోగలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు.సత్యనారాయణ స్వామి ఆలయాల్లో వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులు ముతైదులకు వాయినాలు అందజేసారు. ఆయాల్లో ఉన్న ద్వజస్థంబాలకు భక్తులు పూజలు నిర్వహించి దీపారాధనలు చేసారు. దీంతో ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసి కార్తీక ఏకాదశి సోమవరం పూజలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు.

కుంచావారి గౌరమ్మ ఆలయంలో భారీ అన్నసమారాధన
అనకాపల్లి టౌన్, నవంబర్ 19: స్థానిక కుంచావారి గౌరీ పరమేశ్వర్ల ఆలయం వద్ద సోమవారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. గౌరీ పరమేశ్వర్ల మహోత్సం వేడుకల్లో బాగంగా ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ అధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహిస్తారు. దేశం నాయకులు మళ్ళ సురేంద్ర, జనసేన నాయుకులు కొణతాల సీతారామ్,పరుచూరి భాస్కరరావుతదితర నేతలు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు అధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేసారు. అనంతరం మళ్ళ సురేంద్ర భారీ అన్నసమారాధనను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కామధేనువు ప్రసాద్, చిట్టి, పాండురంగ సత్యారావు, ఎందుకూరి అప్పలరాజు, తలారి ప్రసాద్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.