విశాఖ

అభివృద్ది పనులు ప్రజలకు వివరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, డిసెంబర్ 14: టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఎంపీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కొమ్మిక పంచాయతీ కొత్తతుమ్మలబంద గ్రామంలో పార్టీ మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కోట్లాది రూపాయల రాయితీ రుణాలను అందిస్తోందన్నారు. మండలంలో పలు అంగన్‌వాడీ, పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. ఈసందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఈకార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి వరహాలబాబు, నేతలు భీమరాజు, లక్ష్మయ్య, దేవత తదితరులు పాల్గొన్నారు.
రహదారి మరమ్మతులు చేపట్టాలి
కొయ్యూరు, డిసెంబర్ 14: అద్వాన్నంగా తయారైన రహదారి మరమ్మతులను తక్షణమే చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని గదబపాలెం వాసులు అధికారులకు విజ్ఞప్తి చేసారు. శుక్రవారం మండలంలోని గదబపాలెంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అక్కడి సమస్యలను ప్రజలు అదికారుల ముందు ఉంచారు. ముఖ్యంగా జోగుంపేట నుండి చిట్టింపాడు, గదబపాలెం మీదుగా మర్రిపాలెం వెళ్ళే రహదారి పెద్ద పెద్ద గుంతలతో అధ్వాన్నంగా తయారైందన్నారు. దీంతో ఈ రహదారి వెంట ప్రయాణం ఇబ్బంది కరంగా ఉండడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణం రహదారి మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి తగు చర్యలు చేపడతానని ఎంపీడీ ఓ రెహమాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. చంద్రన్నబీమా, పెళ్ళి కానుక, పసుపు, కుంకుమలు అన్ని కుటుంబాలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇ ఓ ఆర్‌డీ వరలక్ష్మి తెలిపారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాదయాత్రను విజయవంతం చేయండి
కోటవురట్ల, డిసెంబర్ 14: పాయకరావుపేట నియోజకవర్గంలో ఈనెల 24 నుంచి ఎమ్మెల్యే వంగలపూడి అనిత నిర్వహిస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు విజ్ఞప్తి చేసారు. మండలంలో జల్లూరులో శుక్రవారం మండల దేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో కాశీనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే పాదయాత్ర మండలంలో జనవరి మొదటి వారంలో ప్రవేశిస్తుందన్నారు. ప్రతీ గ్రామంలో పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యకర్తలను దేశం పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను వివరించి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈసమావేశంలో దేశం పార్టీ నాయకులు వేచలపు భాస్కరరావు, జీరెడ్డి నానిబాబు, చిటికెల సత్యనారాయణ, సుంకర బాబ్జి, పినపాత్రుని బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ఆరు సంపద తయారీ కేంద్రాలు ప్రారంభం
కోటవురట్ల, డిసెంబర్ 14: మండలంలో ఆరు గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ప్రారంభమైనట్లు ఎడీవో కళ్యాణి తెలిపారు. శుక్రవారం ఆర్‌సీపాలెంలో నిర్మాణం పూర్తయిన సంపద తయారీ కేంద్రాన్ని ఎడీవో , ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు పరిశీలించారు. ఈసందర్భంగా ఎడీవో మాట్లాడుతూ మరో ఆరు కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పలు గ్రామాల్లో ఎనిమిది కేంద్రాలు ప్రారంభదశలో ఉన్నాయన్నారు. ఈకేంద్రాల ద్వారా సంబంధిత పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు. అలాగే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.