విశాఖ

ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, సెప్టెంబర్ 17: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన చోదకులు విధిగా భద్రతా ప్రమాణాలు పాటించాల్సినవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక హీరోహోండా షోరూమ్‌లో రవాణా శాఖాధికారులు ఎల్‌ఎల్‌ఆర్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ వాహన చోదకులు సౌకర్యార్ధం మీ ముంగిట్లో రవాణాశాఖ కార్యక్రమాన్ని పగడ్భందీగా నిర్వహిస్తున్నారన్నారు. దీనివలన లైసెన్స్ లేని వారందరూ ఎటువంటి కాలయాపన లేకుండా తగిన సమయంలో లైసెన్స్ పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రధానంగా వాహన చోదకులు భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అధికారులు కూడా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జారీ కాబడిన ఎల్‌ఎల్‌ఆర్‌లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖాధికారి ఎహెచ్ ఖాన్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు భూతనాథ నానికుమార్, మాజీ ఎంపీపీ గూనూరు సత్యనారాయణ, బొడ్డపాటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.