విశాఖ

క్వారీ అక్రమ తవ్వకాల నిలుపుదలకు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, సెప్టెంబర్ 17: మండలంలో గల టి.సిరసపల్లి రెవెన్యూ సర్వేనెంబర్ 138, 139లో గల క్వారీ తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలని రామారాయుడుపేట గ్రామప్రజలు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం మునగపాక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ టి.సిరసపల్లి రెవెన్యూలో క్వారీ తవ్వకాలు చేసి తరువాత ముగ్గుపిండి తవ్వకాలను సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దీనివలన రామారాయుడుపేట గ్రామం కాలుష్యానికి గురవుతుందన్నారు. 0.7కెఎంలో ఉన్న రామారాయుడుపేట తీవ్రంగా నష్టపోతుందని, అలాగే ఈ కొండపై ముగ్గుపిండి తవ్వకాలు చేసి జీవిస్తున్న 18మంది మహిళా కార్మికులు ఉపాధి కోల్పోతారని వెంటనే అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్న క్వారీని నిలుపుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా స్థానిక తహశీల్దార్ ఆదిమహేశ్వరరావుకు, స్థానిక పోలీసులకు వినతిపత్రాలను అందజేసారు. ఈ నిరసన కార్యక్రమంలో కుందిరి అప్పారావు, తాతారావు, వీరభద్రరావు, సమ్మి అప్పారావు, పాలిక నాగరాజు, సిమ్మా ఆనంద్, కుందిరి శివనాయుడు, కుందిరి వెంకట నాగేశ్వరరావు తదిరులు పాల్గొన్నారు.