విశాఖ

వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, సెప్టెంబర్ 17: వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కె.వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్‌కుమార్ సూచించారు. మండలంలో కె.వెంకటాపురంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వైద్యశిబిరం లో సోమవారం డాక్టర్ ప్రశాంత్‌కుమార్ వైద్య సేవలందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమ కాటు వలన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు సోకుతాయన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా దోమలను అరికట్టవచ్చన్నారు. అలాగే గ్రామాల్లో స్ప్రేయింగ్ కూడా చేయించాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వ్యాధులపై అవగాహన కల్పించారన్నారు. ఈవైద్యశిబిరంలో 60 మందికి రక్తపరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేసామన్నారు. ఈకార్యక్రమంలో వైద్య ఆరోగ్య విస్తరణాధికార బీజేవీ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్త రామరాజు, తదితరులు పాల్గొన్నారు.