విశాఖ

వ్యాధుల నివారణకు సమన్వయంతో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 17: మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు అధికారులంతా కలిసి సమన్వయంతో పని చేయాలని వెలుగు ఎపీడీ ఎం.నాగేశ్వరరావు సూచించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో వెలుగు సిబ్బంది సాధికార మిత్రలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ, వైద్య సిబ్బందితో కలిసి మీరంతా పని చేయాలని వారికి సూచించారు. జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వెంటనే సమీప పీహెచ్‌సీలకు , లేదా వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ఉన్నతి పథకంలో ఈ ఏడాది 17 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 2.79 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిగిలినవి అనుమతి రాగానే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ట్రైబుల్ సబ్ ఫ్లాన్‌లో ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఆరు నుంచి ఏడు శాతం వసూలు అవుతున్నట్లు తెలిపారు. మన్యంలో 1623 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయని వీటి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎపీ ఎం ఈశ్వరరావు, జిల్లా వ్యవసాయ కన్సల్‌టెన్స్ సీహెచ్ గౌతమి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు

కొయ్యూరు, సెప్టెంబర్ 17: ఏజన్సీ 11 మండలాల్లో పారిశుధ్య మెరుగునకు చర్యలు తీసుకుంటున్నట్లుగా డీ ఎల్ పీ ఓ సత్యనారాయణ తెలిపారు. ఎంపీడీ ఓ కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా చేయడంతో పాటు మురుగు కాలువల్లోని మురుగును తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజన్సీ 11 మండలాల్లో 6.80 కోట్లు ఇంటి పన్నలు వసూళ్ళు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2.15 కోట్లు వసూలు చేయడం జరిగిందన్నారు. దోమల నివారణకై పాగింగ్ యంత్రాలను వినియోగించాలని ఆదేశించామన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణ పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీ ఓ రెహమాన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.