విశాఖ

భజన పోటీల్లో మల్లవరం గ్రామానికి ప్రథమ బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, సెప్టెంబర్ 21: మండల స్థాయి భజన పోటీల్లో మల్లవరం గ్రామానికి చెందిన భజన బృందానికి ప్రథమ స్థానం లభించింది. మండల కేంద్రంలో స్థానిక వాయుపుత్ర యూత్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి భజన పోటీలు నిర్వహించారు. దీనికి మండలంలోని ఆరు గ్రామాల నుంచి భజన బృందాలు హాజరయ్యారు. వీటిలో మల్లవరం గ్రామానికి ప్రధమ, లచ్చన్నపాలెంకు ద్వితీయ, కొండల అగ్రహారంకు తృతీయ స్థానాలు లభించాయి. వీరికి ప్రధమ బహుమతిగా ఐదువేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి మూడువేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్లుకు రెండువేలు అందించారు. ప్రోత్సాహక బహుమతిగా పాల్గొన్న జట్లుకు 800 రూపాయలు అందజేసారు.

విశ్వశాంతి కోసం గణపతి హోమం
రావికమతం, సెప్టెంబర్ 21: విశ్వశాంతికి మండలంలోని టి. అర్జాపురం గణపతి ఆలయంలో శుక్రవారం గణపతి హోమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకుడు టి. లక్ష్మణరావు, జి.రామారావుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేసారు. ఈసందర్భంగా అర్చకులు లక్ష్మణరావు మాట్లాడుతూ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా శాంతి దినోత్సవం జరుపుకుంటున్నందున ఇక్కడ గణపతి హోమాన్ని తలపెట్టామన్నారు.

నేడు ధర్నా
రావికమతం, సెప్టెంబర్ 21: మండలంలో చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నామని రాజన్న ఫౌండేషన్ చైర్మెన్ జనసేన క్రియాశీలక నాయకుడైన పీవీ ఎస్ ఎన్ రాజు తెలిపారు. కొత్తకోట జంక్షన్‌లో నిర్వహిస్తున్న ఈదీక్షలో గిరిజనులు, జనసేన కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.
కొయ్యూరులో వైద్యశిబిరం
కొయ్యూరు, సెప్టెంబర్ 21: మండల కేంద్రం కొయ్యూరులో రాజేంద్రపాలెం వైద్యాధికారి జీవన్ సంతోష్ ప్రత్యేక వైద్యశిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలో జ్వరాల తీవ్రత పెరుగుతుండడంతో గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి సుమారు 60 మందిని పరీక్షించారు. జ్వర పీడితులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. జ్వరాలన్నీ డెంగ్యూ కాదని దానిపై అపోహలు వద్దన్నారు. డెంగ్యూ జ్వరాలుగా ప్రచారం సాగుతుండడంతో ప్రజల్లో ఆందోళన మరింత అధికమవుతోందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ జ్వరం వచ్చిన వెంటనే వైద్య సేవలు పొందాలని సూచించారు. ఈకార్యక్రమంలో స్థానిక పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.