విశాఖ

మావోల హత్యాకాండకు నిరసనగా మన్యం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 24: అరకులోయ శాసనసభ్యులు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోస్టులు హతమార్చటాన్ని నిరసిస్తూ విశాఖ గిరిజన ప్రాంతంలో సోమవారం బంద్ పాటించారు. మన్యం బంద్‌కు పోలీసులు వ్యాపారులను ఆదేశించటంతో ఏజెన్సీ వ్యాప్తంగా తమ దుకాణాలను మూసివేశారు. దీంతో అన్ని రకాల దుకాణాలతో పాటు పెట్రోల్ బంక్‌లు, మద్యం దుకాణాలు మూత పడగా, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్ధలు కూడా పనిచేయలేదు. పెట్రోల్ బంక్‌లకు, మద్యం దుకాణాలకు పోలీసులు కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. పెట్రోల్ బంక్‌లను పూర్తిగా మూసివేయాలని వాటర్ బాటిళ్లలో ఎట్టి పరిస్ధితుల్లోను ఇవ్వరాదని ఆదేశించనట్టు తెలుస్తోంది. దీంతో పెట్రోల్ బంక్‌ల యజమానులు ఆదివారం సాయంత్రం నుండి సోమవారం రాత్రి వరకు తమ బంక్‌లకు తాళాలు వేశారు. అదే విదంగా మద్యం విక్రయాలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించి దుకాణాలను మూయించనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హత్య చేయటంతో కోపోద్రిక్తులైన అభిమానులు, గిరిజనులు అరకులోయ, డుంగ్రుడ పోలీసు స్టేషన్లపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పెట్రోల్ బంక్‌లు, మద్యం దుకాణాలపై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. మద్యం అందుబాటులో ఉంటే ఆందోళనకారులు మద్యం సేవించి మరింత అల్లర్లు సృష్టించవచ్చుననే అనుమానంతో పోలీసులు మద్యం దుకాణాలను మూయించినట్టు తెలుస్తుంది. అరకులోయ, డుంబ్రిగుడ పోలీసు స్టేషన్లకు ఆందోళకారులు నిప్పుపెట్టిన ఘటనతో ఖాళీ సీసాల్లో పెట్రోల్ అమ్మకాలను చేయరాదని ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా బంద్‌ను పురష్కరించుకొని పాడేరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సులను ఏజెన్సీలోని అన్ని రూట్లలో నిలిపివేశారు. పాడేరు నుండి చోడవరం, విశాఖపట్నం వంటి మైదాన ప్రాంతాలకు పాక్షికంగా బస్సు సర్వీసులను తిప్పారు. బంద్‌తో అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లోని పర్యటక సందర్శిత ప్రాంతాలు వెలవెలబోయాయి. అరకులోయలోని గిరిజన సాంస్కృతిక మ్యూజియం, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, అనంతగిరి మండలంలోని బొర్రా గుహలను మూసివేశారు. దీంతో పర్యాటకులు పలు ఇబ్బందులకు లోనయ్యారు. ఇదిలా ఉండగా పాడేరులోని ఒకరిద్దరు మద్యం వ్యాపారులు సోమవారం అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో మద్యం విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మద్యం సీసాపై 20నుండి 50రూపాయల వరకు ధరలను పెంచి రహస్యంగా అమ్మకాలను సాగించారు. బంద్‌తో మద్యం దొరకని పరిస్ధితి నెలకొనటంతో మందుబాబులు అధిక ధరలను చెల్లించి మద్యం కొనుగోళ్లకు ఎగబడటం కనిపించింది.