విశాఖ

గర్భిణీలు, బాలింతలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, సెప్టెంబర్ 24: గర్భిణీలు, బాలింతలు విధిగా పౌష్టికాహారం తీసుకునేలా చూడాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలదేనని ఐసీడీ ఎస్ అసిస్టెంట్ సీడీపీ ఓ శాంతిప్రియ అన్నారు. రాచపల్లి కామేశ్వరమ్మ అమ్మవారి ఆలయం వద్ద సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలతో ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల గర్బిణీలు, బాలింతలు ఆహారం తీసుకునే విషయం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టలను వారి ఇళ్ళ వద్ద అతికించాలన్నారు. ఇందులో వారు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో తయారు చేసిన వివిధ రకాల పౌష్టికాహారం ఉంచిన స్టాల్‌ను ఇక్కడప్రదర్శించారు. వీటిపై గర్భిణీలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీ ఓ ఉదయశ్రీ, సెక్టార్ సూపర్‌వైజర్ సత్యవతి పాల్గొన్నారు.