విశాఖ

రైతులకు పంట బీమా మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, నవంబర్ 20: 2012వ సంవత్సరం పంటల బీమాకు సంబంధించి మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన 758 మంది రైతులకు 30 లక్షల 47 వేల రూపాయలు బీమాగా మంజూరైనట్టు రాష్ట్ర జాయింట్ ఫార్మింగ్ కోఆపరేటివ్ సోసైటీల గౌరవ అధ్యక్షుడు జె.సన్యాసిదొర తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని ఇటీవల కలిసి రైతులకు బీమా చెల్లించాలని కోరామని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి రైతులకు బీమా మంజూరు చేసారని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ఇంకా ఆరు గ్రామాల రైతులకు బీమా మంజూరు కావలసి ఉందని ఆయన చెప్పారు.

ముగిసిన గ్రంధాలయ వారోత్సవాలు
మాడుగుల, నవంబర్ 20: 51వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు మంగళవారం ముగిసాయి. ఈ నెల 14వ తేది నుంచి ప్రారంభమైన వారోత్సవాలు వారం రోజుల పాటు మాడుగుల, కస్పాజగన్నాధపురం గ్రంధాలయాలలో విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముగింపు సందర్భంగా బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారులు వి.కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం
మాడుగుల, నవంబర్ 20: మండలంలోని వీరనారాయణం గ్రామంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను మాడుగుల పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలో సత్యవరం, పోతనపూడి, వీరనారాయణం, గొట్టివాడ తదితర ప్రాంతాలలో ఉన్న నదుల నుంచి గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. అయితే వీరనారాయణం గేటు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసారు.

శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి
డుంబ్రిగుడ, నవంబర్ 20 మార్చి నెలలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో శతశాతం ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఏజెన్సీ విద్యాశాఖ అధికారి జ్యోతికుమారి సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాధమిక పాఠశాలలను ఆమె మంగళవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు. పరీక్షలలో విద్యార్థులు తప్పితే సంబంధిత సబ్‌జెక్టు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కె.బాలాజి పాల్గొన్నారు.