విశాఖ

నేడు మెగా గ్రౌండింగ్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, నవంబర్ 20: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 21వ తేది బుధవారం మెగా గ్రౌండింగ్ మేళాను నిర్వహిస్తున్నట్టు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి మంగళవారం విలేఖరులకు తెలిపారు. గత వారం నిర్వహించాల్సిన మేళాను అనివార్య కారణాల చేత వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి మేళాకు హాజరై గిరిజన లబ్ధిదారులకు 12 కోట్ల 98 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను పంపిణీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేళాలో 5 వేల 140 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకాలను అందచేయనున్నట్టు ఆయన చెప్పారు. ఐ.టి.డి.ఎ. నుంచి 7 కోట్ల 17 లక్షల వ్యయంతో 4 వేల 703 మంది గిరిజన లబ్దిదారులకు, ఎస్.సి., బి.సి., కాపు, మైనారిటీ, బి.సి. ఫెడరేషన్, దివ్వాంగుల ఆర్థిక సంస్థ ద్వారా 5 కోట్ల 80 లక్షలతో 437 మంది లబ్ధిదారులకు వివిధ యూనిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. లబ్ధిదారులకు తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజన్లు, పసుపుశుద్ధి యంత్రాలు, కాఫీ రైతులకు మిరియాల సేకరణకు అవసరమయ్యే నిచ్చేనలు, మిల్లులు, టెంట్ హౌస్‌లు, పవర్ టిల్లర్లు వంటి వాటిని ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు మెగా గ్రౌండింగ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆయన అన్నారు. లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని బాలాజి కోరారు.

ఘనంగా ముగిసిన గ్రంధాలయ వారోత్సవాలు
పాడేరు, నవంబర్ 20: 51వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. ఈ నెల 14వ తేది నుంచి ప్రారంభమైన గ్రంధాలయ వారోత్సవాలు ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో విద్యార్థులను అలరించాయి. ఈ సందర్భంగా స్థానిక శాఖా గ్రంధాలయంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు క్విజ్, వకృత్వ, పాటలు, చదరంగం, చిత్రలేఖనం, చదరంగం, ముగ్గుల వంటి పోటీలతో పాటు పుస్తక ప్రదర్శన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. గ్రంధాలయ వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీలలో స్థానిక సుండ్రుపుట్టు, పాత పాడేరు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలకు చెందిన బాల బాలికలు, అక్షర పబ్లిక్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని పలు బహుమతులను గెలుచుకున్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో బహుమతులను, ప్రశంసా పత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రదానోపాధ్యాయులు టి.బాబురావు, జగన్నాధం, నాగేశ్వరరావు, అక్షర పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్, సుండ్రుపుట్టు పాఠశాల ఉపాధ్యాయులు బాకూరు సుశీల, త్రిపుర సుందరి, స్థానిక శాఖా గ్రంధాలయ అధికారి ఎం.సత్యవతి, పలు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అరకులోయలో,
అరకులోయ, నవంబర్ 20: జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు మంగళవారం ముగిసాయి. స్థానిక శాఖా గ్రంధాలయంలో ఈ నెల 14వ తేదిన ప్రారంభమైన వారోత్సవాలను పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు వైస్ ఎం.పి.పి. పొద్దు అమ్మన్న బహుమతులు, ప్రశంసాపత్రాలు అందచేసారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల ప్రిన్సిపాల్స్ పారయ్య, శ్రీరామమూర్తి, గ్రంధాలయ అధికారి జి.మురళీక్రిష్ణ, పెదలబుడు మాజీ ఉప సర్పంచ్ సత్యానందం, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సమరశీల పోరాటాలకు సిద్ధం కండి
పాడేరు, నవంబర్ 20: తమ సమస్యలను పరిష్కరించుకుని, హక్కులను కాపాడుకునేందుకు కార్మికులంతా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక సి.ఐ.టి.యు. కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సి.ఐ.టి.యు. మండల కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర చట్టాలు లేవని, కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న మోటార్ ట్రాన్స్‌పోర్టు చట్టం ఆటో, మోటార్ కార్మికుల మెడపై కత్తిలా ఉందని ఆయన అన్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయలేని ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని, మధ్యాహ్నా భోజన పథకం కార్మికులకు వేతనాలను పెంచి ఈ పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో సి.ఐ.టి.యు. నాయకులు ఆర్.శంకరరావు, ఎల్.సుందరరావు, వై.మంగమ్మ, కొండబాబు, రాజు, సింహాచలం, సుజాత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.