విశాఖ

లక్ష్యంవైపు దృష్టిసారిస్తే సంకల్పం నెరవేరుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జూలై 13: లక్ష్యం వైపు దృష్టిసారించిన నాడే సంకల్పం నెరవేరుతుందని మిషన్ ఎవరెస్టు కార్యక్రమం ద్వారా అతి ఎతె్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిగమించిన ఆంధ్రప్రదేశ్ తొలి మహిళ కొయ్య ఆశాకిరణ్ రాణి తెలిపారు. శుక్రవారం స్థానిక ఉషోదయా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆమెకు అభినందనల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తాను పేదరికంలో ఉన్నప్పటికీ ఏదో సాధించి తాను పుట్టిన గడ్డకు, కన్న తల్లిదండ్రులకు పేరుప్రఖ్యాతులు రావాలనే తపనతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు అయినంత మాత్రాన భయపడి ఇంటికే పరిమితం కావాల్సినవసరం లేదన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధైర్యంతో సాహసం చేసి తమ ప్రతిభను చూపిన నాడే తగిన గుర్తింపులభిస్తుందని ఆమె అన్నారు. ఆశయం గొప్పదైతే అందుకోసం ఏదైనా సాధించుకోవచ్చన్నారు. తన తల్లిదండ్రులు పేదవారు కావడంతోపాటు తాను బాలికగా ఉండటం వలన క్రీడల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దిశగా ఏమీ సాధించలేకపోయానన్నారు. అయితే ప్రభుత్వం మిషన్ ఎవరెస్టు ద్వారా పర్వతారోహణకు సహకారం అందిస్తుందనే ప్రకటనను చూసి తాను ఆ లక్ష్యసాధనకు ఎంతగానో శ్రమించానన్నారు. మే 13వ తేదీన తాను ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించగలిగానని ఆమె తెలిపారు. మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఎవరైనా లక్ష్యం వైపు దృష్టిసారించిన నాడు సంకల్పాన్ని నెరవేర్చుకోగలరన్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే సమయంలో 90శాతం వరకు భద్రత ఉండదన్నారు. అయినప్పటికీ ఏదో ఒకటి సాధించాలనే తపన ఉండటంతో తన ప్రతిభను నిరూపించుకోగలిగానని, క్రమశిక్షణ, ఏకాగ్రత ఉన్నవారు తమ ఆశయాలను నెరవేర్చుకోగలరని ఆమె తెలియజేసారు. విద్యార్థులు తల్లిదండ్రులు తమకు అన్నివిధాలా సహకరించలేదన్న నెపాన్ని పక్కనపెట్టి లక్ష్యాన్ని సాధించడానికి తాము ఏ విధంగా కృషిచేయగలమన్న పట్టుదలతో సాధించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉషోదయా విద్యాసంస్థల యాజమాన్యం, బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసరావు, మంగమ్మలను కూడా ఘనంగా సత్కరించి పదివేల రూపాయల నగదు బహుమతిని అందజేసారు. అలాగే విద్యార్థినులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఉత్సాహం చూపించారు. ఈ కార్యక్రమంలో ఉషోదయా విద్యాసంస్థల చైర్మన్ రమణాజీ, కరస్పాండెంట్ కృష్ణకుమారి, డీన్ వాసు తదితర ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

చోడవరం - తెనుగుపూడి బస్సు సదుపాయాన్ని పునరుద్దరించాలి
చోడవరం, జూలై 13: విద్యార్థుల సౌకర్యార్ధం గతంలో ఏర్పాటు చేసిన చోడవరం - తెనుగుపూడి బస్సు సర్వీసును రద్దు చేయడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.శంకర్ అన్నారు. శుక్రవారం చోడవరం - తెనుగుపూడి బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు క్యాంపుకార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి గుంతలుగా మారిపోవడంతో బస్సు సర్వీసును రద్దుచేసారని దీనివలన ఇటు విద్యార్థులు, వివిధ గ్రామాల ప్రజలు కూడా నానా అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిపై ఆర్టీసి అధికారులను కలిసి వినతిఫత్రం సమర్పించినప్పటికీ వారు రహదారి మరమ్మతులు నిర్వహించకుంటే బస్సుసర్వీసును పునరుద్ధరించలేమని ఆర్టీసి అధికారులు తేల్చి చెప్పడంతో ఆర్‌అండ్‌బి అధికారులను కూడా కలిసి వినతిపత్రం సమర్పించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యేగా చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించేందుకు రహదారి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ రహదారి మరమ్మతులకు టెండర్లు పిలవడం జరిగిందని త్వరలోనే ఆ పనులు పూర్తిచేసి బస్ సర్వీసును పునరుద్దరించేందుకు తనవంతు కృషిచేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.