విశాఖ

వాల్టాకు తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, జూలై 13: స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది అండదండలతో బహిరంగంగా ఇసుక స్మగ్లింగ్ జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ డీవీ ఎస్‌రాజు ఆరోపించారు. శుక్రవారం స్థానిక మాజీ ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో డీవీ ఎస్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సీపట్నంలో ప్రభుత్వం మంజూరు చేసిన గృహ సముదాయాన్ని నిర్మిస్తున్న టాటా కంపెనీకి అధికారులు ఓల్టాచట్టాన్ని ఉల్లంఘించి 15 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చారన్నారు. ఈమేరకు అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను కాపీని చూపించారు. మండలంలో ఇసుక నిల్వలు లేవని మైనింగ్ అధికారులు ఇచ్చిన నివేదికను కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడం శోఛనీయమన్నారు. ఇసుక అనుమతి కోసం మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సిఫార్సు చేయాల్సి ఉంటుందన్నారు. మండలం ఇసుక సరఫరాను మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు సిఫార్సు చేయలేదన్నారు. దీనిని బట్టి రెవెన్యూ అధికారులు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమవుతుందన్నారు. పైగా ఇసుక రవాణా చేసే బాధ్యతను అధికార పార్టీకి చెందిన నేతలకు సంబంధించి ఆరు ట్రాక్టర్లను మాత్రమే అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. పర్మింట్లులేకుండా ఈ ఆరు ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నాయన్నారు. టాటా కంపెనీ పేరుతో ఈ ట్రాక్టర్లతో ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఆర్‌టీ యాక్టు ప్రకారం ఇసుక రవాణా , వాల్టా చట్టం గురించి తహశీల్దార్ శ్రీనివాస్‌ను సమాచారం అడుగగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నేతలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పట్టించుకోని అధికారులు స్థానికంగా సామాన్యులు తమ అవసరాల కోసం ఇసుకను తీసుకువెళితే దాడులు చేసి కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
* తహశీల్దార్ శ్రీనివాస్ వివరణ
జిల్లా కలెక్టర్, నర్సీపట్నం ఆర్డీవోల ఉత్తర్వుల మేరకే టాటా కంపెనీకి ఇసుక సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ స్పష్టం చేసారు. మండలంలో వెయ్యి క్యూబిక్ మీటర్లు మాత్రమే ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు. టాటా కంపెనీ ఇచ్చిన నెంబర్లు గల ట్రాక్టర్లకే ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చామన్నారు. అయితే పర్మింట్లు మాత్రం ఇవ్వలేదన్నారు. రాజకీయాలకు తావు లేకుండా ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తున్నామన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రభుత్వ పనులకు వర్క్ ఆర్డర్‌ను తీసుకువచ్చిన మాజీ ఎమ్మెల్సీ డీవీ ఎస్ రాజుకు శుక్రవారం మూడు పర్మిట్లు ఇచ్చామన్నారు. వివాదాలకు తావు లేకుండా ఇసుక తవ్వకాలను ఈనెల 16 నుంచి ఇసుక తవ్వకాలను నిషేధిస్తున్నట్లు తహశీల్దార్ స్పష్టం చేసారు.

ఎన్టీ ఆర్ గృహ నిర్మాణ పధకంలో అవినీతి
రావికమతం, జూలై 13: అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు గతంలో నిర్మించిన ఇళ్ళకే మళ్ళీ ఎన్టీ ఆర్ గృహ నిర్మాణ పథకంలో లక్షా 50 వేల రూపాయలు చొప్పున చెల్లించి గృహ నిర్మాణ శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని అర్జాపురం ఉప సర్పంచ్ ఇళ్ళపు సన్యాసినాయుడు ఆరోపించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దంగేటి రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో సన్యాసినాయుడు మాట్లాడుతూ తమ గ్రామంలో పక్కా గృహాలు మంజూరులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. గతంలో లబ్దిపొందిన వారికే తిరిగి ఎన్టీ ఆర్ గృహ నిర్మాణ పథకంలో పక్కాగృహాలు మంజూరు చేసి ఇళ్ళు నిర్మించకుండానే నిధులు డ్రా చేసారని ఆరోపించారు. వివిధ ధృవీకరణ పత్రాలు మంజూరు, పాసుపుస్తకాలు జారీకి రెవెన్యూ అధికారులు రైతులను , విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నంపేట ఎంపీటీసీ బంటు శ్రీను ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏడాది పొడుగునా కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కాలేదని మండిపడ్డారు. ఖరీప్‌కు పూర్తి స్థాయి విత్తనాలు సరఫరా చేయలేదని కిత్తంపేట సర్పంచ్ రమణమ్మ ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో రద్దు చేసిన 306 బస్సులను పునరుద్దరించాలని పలు మార్లు కోరినా స్పందించలేదని ఆర్టీసి అధికారుల తీరుపై పలువురు ఎంపీపీలు, సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. అంతకు ముందు ఎంపీపీ రామకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పారదర్శకమైన పాలన కొనసాగిస్తున్నామని , ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎడీవో జయ ఫ్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.