క్రైమ్/లీగల్

బైక్‌ను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, సెప్టెంబర్ 8: గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను దగ్ధం చేసారు. వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా జీవనోపాధి కోసం రాజస్ధాన్ నుంచి వచ్చిన ఉత్తమ్‌సింగ్ అనే వ్యక్తి తోపుడు బండిపై స్వీట్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. షాపు ముగించుకుని శుక్రవారం రాత్రి ఇంటి వద్ద బైక్‌ను పార్కు చేసారు. దీనిని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసారు. ఉదయం దీనిని గమనించిన ఉత్తమ్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా - డ్రైవర్ మృతి
కొయ్యూరు, సెప్టెంబర్ 8: ప్రమాదవశాత్తు దుక్కుతున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ యజమాని , డ్రైవర్ వేమల అప్పారావు(37) అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలోని పట్టపణుకుల పంచాయతీ కాట్రగెడ్డకు చెందిన వేమ అప్పారావు తమ సమీప బంధువు జీడిమామిడి తోటలో దుక్కి దునే్నందుకై తన ట్రాక్టర్‌పై వెళ్ళాడు. దున్నతుండగా ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అప్పారావు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు , బంధువులు అక్కడికి చేరుకుని చూసే సరికి అప్పారావు మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. విషయాన్ని కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించడంతో కొయ్యూరు ఇన్‌చార్జ్ ఎస్సై శ్రీనివాసరావు , సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్ళి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృత దేహాన్ని బయటకు తీసి శవ పంచనామా నిర్వహించారు. మృతునికి భార్య , ఇద్దరు పిల్లలున్నారు. అప్పారావు అకాల మృతితో కుటుంబీకులు రోధిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది.