క్రైమ్/లీగల్

తుమ్మపాల సుగర్స్ కార్మికుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 25: ఆకలిచావుతో తుమ్మపాల సుగర్స్ కార్మికుడు సోమవారం చింతలపాటి రాంబాబు(55) మృతి చెందారు. ఈ సుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాంబాబుకు గడచిన 45నెలలు నుండి జీతాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. గడచిన గతకొంత కాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. నెలలు తరబడి జీతాలు అందకపోవడంతో పూటగడవడానికి కష్టంగా ఉన్న తరుణంలో వైద్యం పొందేందుకు సైతం డబ్బులు లేక నానా అవస్థలు పడ్డాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో డాక్టర్ ఇచ్చే మందులు సైతం కొనుగోలు చేసుకోలేని దుస్థితిలో కాలం వెళ్లదీసాడు. గుండెజబ్బుతో బాధపడుతున్నానని పూటగడవడానికి కష్టంగా ఉందని, వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేవని స్థానిక ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణని, జిల్లాకలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి పలు పర్యాయాలు రాంబాబు ఏకరువుపెట్టారని అయినా పాలకుల కరుణ కానరాలేదని తుమ్మపాల సుగర్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు నూకేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికే తుమ్మపాల సుగర్స్‌లో ఆకలిచావులకు గురై ఎనిమిది మంది మృత్యువాతకు గురికాగా ఈ విషయంను పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా కానరాలేదన్నారు. స్థానిక ఎం.పి,ఎమ్మెల్యేలు తుమ్మపాల సుగర్స్ కార్మికుల పట్ల మానవతం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
మాకవరపాలెం, జూన్ 25: మండలంలో నామవరం గాంధీ జంక్షన్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంల యువకుడి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఎల్ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లి మండలం దేవవరంకు చెందిన గొర్లి అప్పారావు పాయకరావుపేట నుండి మోటార్ సైకిల్‌పై నక్కపల్లి వైపు వెళ్తుండగా పాయకరావుపేట మండలం నామవరం గాంధీ జంక్షన్ జాతీయ రహదారిపై ఉన్న స్టాప్ బోర్డును ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. తలకు, ముఖంపై బలమైన గాయాలు కావడంతో తూర్పుగోదావరి జిల్లా తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవలకై కాకినాడ తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి తదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.