విశాఖ

పంచగ్రామాల సమస్య ప్రభుత్వ వైఫల్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: న్యాయస్థానాల్లో కేసుల వల్లే పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించలేకపోయామన్న ప్రభుత్వ ప్రకటనపై ఫోరం ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఆంధ్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లే సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదని ఫోరం ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ ఘాటుగా విమర్శించారు. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత విశాఖలో నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో సింహాచలం భూ సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. దీనిలో భాగంగానే 2015 ఆగస్టులో ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, దీనిపై న్యాయస్థానం ఇప్పటికీ ఆర్డరు ఇవ్వకపోవడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కాదా అని ప్రశ్నించారు. సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి సమస్య సృష్టించిందే టీడీపీ ప్రభుత్వమని ఆరోపించారు. అప్పటి వరకూ భూములపై ఎటువంటి హక్కులు లేని దేవస్థానానికి ప్రభుత్వమే పట్టాలు ఇప్పించింద, హక్కులు కల్పించిందన్నారు. వాటి ఆధారంగా 578 జీఓను తీసుకువచ్చి క్రమబద్దీకరణ పేరిట స్థల యజమానులచే డబ్బులు కట్టించారన్నారు. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాలు చెల్లవంటూ ఆర్డీఓ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి ఉంటే సమస్య ఇప్పటికే పరిష్కారమై ఉండేదన్నారు. దీనిపై దేవస్థానం కార్యనిర్వహణ అధికారి హైకోర్టుకు వెళ్లేందుకు కూడా అప్పటి ప్రభుత్వమే అనుమతిచ్చిందని గుర్తు చేశారు. దేవస్థానం భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి అన్యాయం జరుగుతుండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం దర్జాగా ఉన్నారన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సింహాచలం దేవస్థానం భూ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

గీతం ఫిన్‌టెక్ విద్యార్థులకు ఆహ్వానం
విశాఖపట్నం, సెప్టెంబర్ 19:దేశంలోనే తొలిసారిగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన ఫిన్‌టెక్ అకాడెమీలో రెండేళ్ల ఎంబీఏ ఫిన్‌టెక్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. గీతం విద్యార్థులకు న్యూయార్క్‌కు చెందిన క్యుములస్ నెక్సన్ సంస్థ నుంచి ఆహ్వానం అందింది. న్యూయార్క్ కేంద్ర కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి సీఐఒ కెల్లీ ఫ్లెమింగ్‌తో పాటు సీఈఓ క్రిస్ నోబుల్, లండన్‌లోని సీటీఓ రోణంకి నందికిషోర్ స్కైప్ ద్వారా గీతం ఫిన్‌టెక్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేశారు. విద్యార్థుల్లో ఫిన్‌టెక్ విషయ పరిజ్ఞానం మెండుగా ఉందని, అవసరం అయితే కోర్సు అభ్యసిస్తూనే తమ ప్రాజెక్టులకు పార్ట్‌టైం పనిచేయవచ్చని ఆహ్వానం పలికారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో పేరొందిన న్యూయార్క్ కంపెనీలో గీతం విద్యార్థులకు అవకాశం లభించడం అభినందనీయమని ఫిన్‌టెక్ అకాడెమీ కోఆర్డినేటర్ లెబెన్ జాన్సన్ పేర్కొన్నారు. త్వరలో విశాఖలో జరిగే ఫిన్‌టెక్ ఫెస్టివల్‌కు హాజరవుతున్న న్యూయార్క్ కంపెనీ ప్రతినిధులు గీతం యూనివర్శిటీని సందర్శించనన్నారని ఆయన తెలిపారు. ఫిన్‌టెక్‌కు రానున్న రోజుల్లో విశాఖ కేంద్రం కానుందని ఈ దృష్ట్యా విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు.

ఆటోడెస్క్ రివిట్‌పై గీతంలో వర్క్‌షాప్
ఆరిలోవ, సెప్టెంబర్ 19: గీతం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆటోడెస్క్ రివిట్ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక వర్క్‌షాప్‌ను బుధవారం నిర్వహించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే లక్ష్మీప్రసాద్ ముఖ్యఅతిధిగా హాజరై సివిల్ ఇంజనీరింగ్ రంగంలో నిర్మాణాల నాణ్యతకు, భవన ప్రణాళికలను సమర్ధవంతంగా రూపొందించుకునేందుకు ఆటోడెస్క్ రివిట్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించిన డేటాప్రో సంస్థ ప్రాజెక్టు నిపుణుడు ఐ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ భవన నిర్మాణానికి ముందే సాఫ్ట్‌వేర్ సహాయంతో భవనాల రూపురేఖలు త్రీడీ పరిజ్ఞానంతో సరిచూసుకునేందుకు ఆటోడెస్క్ రివిట్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ రమేష్, కోఆర్డినేటర్‌లు చిట్టిబాబు, డాక్టర వీ సౌజన్యవాణి, ఎస్ సునీల్ పాల్గొన్నారు.