విశాఖ

తుమ్మపాల రైతులతో చెరకు కొనుగోలు అగ్రిమెంట్లు వెంటనే చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, సెప్టెంబర్ 20: తుమ్మపాల సుగర్స్ రైతులతో చెరకు కొనుగలు అగ్రిమెంట్లను తక్షణమే చేయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విశాఖజిల్లా శాఖ సమావేశం డిమాండ్ చేసింది. గురువారం స్థానికంగా జరిగిన జిల్లా రైతుసంఘ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి మేకా సత్యనారాయణ మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా కార్మికులు, రాజకీయ పార్టీల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం స్పందించి 30కోట్లు గ్రాంట్‌ను ఇస్తామని జీవోను జారీచేయడం పట్ల హర్షం ప్రకటించారు. అయితే సీజన్ మరో రెండునెలల్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఇంతవరకు రైతుల నుండి ఎటువంటి అగ్రిమెంట్లు తీసుకునే ప్రయత్నాలు సుగర్స్ అధికారులు చేయకపోవడం తగదన్నారు. సుగర్ ఫ్యాక్టరీ తాము పండించిన చెరకును తీసుకుని తగు గిట్టుబాటు ధరను సకాలంలో సక్రమంగా చెల్లిస్తుందన్న నమ్మకాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం కల్పించాలని డిమాండ్ చేసారు. చెరకు రైతుల సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ఈ విషయమై ప్రభుత్వం తగు భరోసాను ఇవ్వాలని జిల్లా రైతు సంఘ కార్యదర్శి వేచలపుకాసుబాబు అన్నారు. టన్ను చెరకుకు 3500 రూపాయల ధర చెల్లించాలని, ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు వెంటనే సొమ్ము దక్కుతుందనే నమ్మకాన్ని రైతుల్లో కలిగించాలని ఆయన డిమాండ్ చేసారు. చెరకు పంట విస్తీర్ణం పెరగాలంటే చెరకు విత్తనం, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేసారు. కార్మికులకు బకాయిపడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని, మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రైతు సంఘ కార్యదర్శి కోరిబిల్లి శంకరరావు కోరారు. సమావేశంలో ఆడారి అప్పారావు, వైఎన్ బద్రం, మళ్ల జోగారావు, కోన లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

అక్కినేని అభిమానులకు ఘన సత్కారం
అనకాపల్లి, సెప్టెంబర్ 20: ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షులు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో అక్కినేని 95వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదిమంది అక్కినేని అభిమానులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. మహిళలకు వస్త్రాలను అందజేసారు. ముఖ్య అతిధిగా డాక్టర్ కెకెవిఎ నారాయణరావు పాల్గొని అక్కినేని అభిమాన సంఘం వేదికగా పేదలకు వస్తద్రానం చేయడం అభినందనీయమని సురేంద్రను కొనియాడారు. సత్కారం అందుకున్న వారిలో ఎఎంఎఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బుద్ద అప్పారావు, రాము యాదవ్, కొణతాల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయంతో పరిస్థితి మెరుగుపరుచుకోండి
చోడవరం, సెప్టెంబర్ 20: అందజేసిన బీమా సొమ్ముతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు సూచించారు. గురువారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు బాధిత కుటుంబ సభ్యులకు చంద్రన్న బీమా చెక్కులను అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమా సొమ్ముతో జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలన్నారు. గోవిందమ్మకాలనీకి చెందిన గోవిందరావు మృతిచెందగా భార్య మహాలక్ష్మికి రెండులక్షల రూపాయలు, వెంకయ్యగారిపేటకు చెందిన కోరుకొండ రామారావు మరణించగా నామిని అరుణకు రెండులక్షల రూపాయలు, జుత్తాడకు చెందిన బి. అప్పయ్యమ్మ మరణించగా ఆయన కుటుంబ సభ్యులు రామకృష్ణకు 30వేలు, అడ్డూరు బండా లక్ష్మి మృతిచెందగా ఆమె కుమారుడు సన్యాశిపాత్రుడుకు రెండులక్షలు, గవరవరంకు చెందిన బూర రమణ భార్య ఎరుకమ్మకు రెండులక్షల రూపాయల చెక్కులను అందజేసారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి కనిశెట్టి మత్స్యరాజు, రావికమతం ఎంపీపీ దంగేటి రామకృష్ణ, బీమా మిత్ర జోగరాద తదితరులు పాల్గొన్నారు.

పూడుకుపోయిన డ్రైనేజీ కాలువలను పరిశీలించిన జెడ్సీ
అనకాపల్లి, సెప్టెంబర్ 20: పూడిమడక జాతీయ రహదారి జంక్షన్, బైపాస్ రోడ్డు జంక్షన్, ఆర్టీసి కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో పూడుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థను జీవీఎంసి జోనల్ కమీషనర్ రాము ఇతర అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. స్థానిక ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆయన సోదరుడు మహేష్‌తో కలిసి ఈ కాలువల దుస్థితిని పరిశీలించారు. బైపాస్ రోడ్డు జంక్షన్ దగ్గర స్తంభించిపోయిన డ్రైనేజీని శుభ్రపరచడానికి నేషనల్ హైవే అథారిటీ అధికారులతోను, జీవిఎంసి జోనల్ కమీషనర్‌తోను చర్చించారు. తక్షణమే ఈ పూడుకుపోయిన డ్రైనేజీ కాలువలను మెరుగుపరచడం ద్వారా నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటామని జీవీఎంసి జోనల్ కమీషనర్ ఆ ప్రాంతీయులకు భరోసా ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ తాడి రామకృష్ణ, జిల్లా దేశం నాయకులు గుత్తా ప్రభాకర చౌదరి, బోడి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.