విశాఖ

ఓటమి చెందినా ప్రజా సంక్షేమానికి పాడుపడుతున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, సెప్టెంబర్ 20: ఎన్నికల్లో తాను ఓటిమి చెందినా నిరంతరం ప్రజల్లో మమేకవౌతూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం దేశం పార్టీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు అన్నారు. మండలంలోని ఒమ్మలి, వి.జె.పురం, కింతలి, కింతలివల్లాపురం, పొంగలిపాక గ్రామాలలో గురువారం సైకిల్ యాత్ర నిర్వహించి ఆయా గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను అధికారంలో లేకపోయిన గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ అనేక కార్యక్రమాలను అమలు చేయిస్తున్నట్టు చెప్పారు. మాడుగుల నియోజకవర్గంలో తాను గత నాలుగు సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలను మంజూరు చేయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలో ఉండడంతో ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చగలుగుతున్నట్టు ఆయన చెప్పారు. మాడుగుల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన బూడి ముత్యాలనాయుడు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని ఆయన విమర్శించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నానని పదే పదే చెబుతున్న ఆయన ప్రజల సమస్యలపై ఎప్పుడు స్పందించారని ఆయన ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాటం చేసి వాటి పరిష్కారానికి కృషి చేసానని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓటును అడిగే హక్కు ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే వారికి, అభివృద్ధి చేసిన వారికి మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు. మాడుగుల మండల వాసులకు సురక్షిత నీటిని అందించాలన్న ఉద్ధేశ్యంతో గాదిరాయి, మాడుగుల, ఎం.కోడూరు, ముకుందపురం, పొంగిలిపాక పంచాయతీ శివరామపురం గ్రామాలకు మినరల్ వాటర్ ఫ్లాంట్‌లు మంజూరు చేయించినట్టు రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు నందారపు సన్యాసిరావు, చామంతుల జయరాం, ఉండూరు దేముడు, కలవలపల్లి సోమన్నదొర, అద్దెపల్లి జగ్గారావు, పూసర్ల భీమన్నదొర, సి.హెచ్.కుమార్, కర్రి నాగమణి, శ్రీనాధు మధు, తాళపురెడ్డి రాజు, మజ్జి విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనులపై రేపు సామాజిక తనిఖీ
పాడేరు, సెప్టెంబర్ 20: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులపై ఈ నెల 21వ తేది శనివారం సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్టు ఉపాధి హామీ పథకం ప్రోగ్రాం అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు పాడేరు మండలంలో చేపట్టిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలో గుర్తించిన అంశాలపై ఈ నెల 22న స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ప్రజావేదిక నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

23న కంట్రాక్టు ఉద్యోగుల సమావేశం
పాడేరు, సెప్టెంబర్ 20: విశాఖ ఏజెన్సీలో కంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంతో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులతో ఈ నెల 23వ తేది ఆదివారం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు గిరిజన ప్రాంత వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శెట్టి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రాక్టు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్థానిక సి.ఐ.టి.యు. కార్యాలయంలో జరిగే సమావేశానికి కంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.