విశాఖ

భూగర్భ మురుగు నీటి కాలువలకు నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, సెప్టెంబర్ 20: అరకులోయ పట్టణంలో భూగర్భ మురుగు నీటి కాలువల నిర్మాణానికి 3 కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరైనట్టు స్థానిక ఎం.పి.డి.ఒ. విజయకుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీ పరిధిలోని అరకులోయ పట్టణాన్ని స్వచ్ఛ అరకులోయగా తీర్చిదిద్దేందుకు మురుగు నీటి కాలువల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అరకులోయలో అపారిశుధ్యాన్ని పారద్రోలేందుకు కృషి చేస్తున్నామని, అన్ని వర్గాల వారి సహకారంతో పారిశుధ్యం నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. స్థానికులు, వ్యాపారులు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, రహదారులు, వీధులలో చెత్త చెదారాలు వేయకుండా చూడాలని ఆయన కోరారు. అరకులోయ పట్టణ పరిధిలో నాలుగు కోట్ల 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ పనులలో కొన్ని పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్టు ఆయన చెప్పారు. గనె్నల జంక్షన్ నుంచి గ్రామం వరకు గల రహదారికి మరమ్మతులు చేసేందుకు 38 లక్షల రూపాయలు మంజూరైనట్టు ఆయన తెలిపారు. లింబగుడ నుంచి డొల్లిగుడ గ్రామం వరకు 63 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు విజయకుమార్ చెప్పారు.

సి.ఆర్.పి.ఎఫ్. ఉద్యోగాలకు 850 మంది దరఖాస్తు
అరకులోయ, సెప్టెంబర్ 20: అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల నుంచి సి.ఆర్.పి.ఎఫ్.లో ఉద్యోగాల కోసం 850 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇ.వెంకునాయుడు తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో నుంచి ఐదు వందల మందిని ఎంపిక చేయనున్నామని చెప్పారు. పాడేరు ఐ.టి.డి.ఎ., పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేది ఆదివారం దరఖాస్తుదారులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికి సి.ఆర్.పి.ఎఫ్.లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు పబ్లిక్ పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నామని, దీనికి హాజరయ్యే అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, దరఖాస్తు రిజిష్ట్రేషన్ నెంబరు, తదితర వాటిని తీసుకురావాలని ఆయన సూచించారు. సి.ఆర్.పి.ఎఫ్. ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. స్థానిక యువజన శిక్షణ కేంద్రంలో శారీరక దారుఢ్యంతో పాటు రాత పరీక్ష కోసం 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నామని, ఈ అవకాశాన్ని గిరిజన అభ్యర్థులు వినియోగించుకోవాలని వెంకునాయుడు కోరారు.

మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి
పాడేరు, సెప్టెంబర్ 20: వివిధ రకాల వ్యాధులతో సతమతవౌతున్న గిరిజన ప్రాంతంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఎం.శ్రీను డిమాండ్ చేసారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో మలేరియాతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి విజృంభించి అనేక మందిని ఇప్పటికే బలిగొన్నదని చెప్పారు. డెంగ్యూతో బాధపడుతూ ఒకవైపు మరణాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ వ్యాధిబారిన పడ్డవారు మైదాన ప్రాంత ఆసుపత్రులో చికిత్సలు పొందుతున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీలో దోమల కారణంగా వ్యాప్తి చెందుతున్న డెంగ్యూను నివారించడంలో విఫలమైన ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరిట ర్యాలీలతో సరిపెడుతుందని ఆయన విమర్శించారు. గిరిజన గ్రామాలలో సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని, ఈ ప్రాంత ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉండడం లేదని ఆయన చెప్పారు. దీంతో వ్యాధులకు గురైన గిరిజనులకు సకాలంలో సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్న సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఏజెన్సీలో అనారోగ్య పరిస్థితులు విలయతాండవం చేస్తున్న ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ చేతులు దులుపుకుంటుందని ఆయన విమర్శించారు. ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని శ్రీను డిమాండ్ చేసారు.