విశాఖపట్నం

తిత్లీ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, అక్టోబర్ 16: తిత్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాలకు తీవ్ర నష్టం వాటిల్లిన కారణంగా తిత్లీ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకొవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. నగరంలోని జగదాంబ సిటూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, వజ్రపుకొత్తురు, సంతబొమ్మాలి, నందిగామ, ఉద్ధానం మండలాల్లో గత రెండు రోజుల క్రితం సీపీ ఎం పార్టీ పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. పంటలు కొల్పోయిన రైతాంగానికి తక్షణమే నష్టపరిహారం అందించి వారిని ఆదుకొవాలన్నారు. జీడీ పంటకు ప్రభుత్వం ఒక హెక్టార్‌కు రై.25వేలు ప్రకటించిందని, వాస్తవానికి ఎకరాకు ఎనిమిది బస్తాలు జీడిపిక్కలు పండుతాయని, వీటి ద్వారా లక్ష రూపాయాల వరకూ ఆదాయం వస్తుందన్నారు. ఈనేపథ్యంలో ఎకరాకు నష్టపరిహారం లక్ష రూపాయాలను ప్రకటించాలన్నారు. కొబ్బరిచెట్టుకు రూ.1200 చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని, రైతుల చెట్టుకు కనీసం ఐదు వేల ప్రకటించాలని డిమాండ్ చేశారు. పలాసలో ఉన్న సుమారు వందకుపైగా జీడీ పరిశ్రమలు మూతపడితే ఇరవై వేల మంది వరకూ కార్మికులు పనులు లేక రోడ్డున పడుతారని తక్షణమే వారిని మరింతగా ఆదుకొవాలన్నారు. ఉద్దానంలో ఉన్న కిడ్నీ రోగులకు సకాలంలో డయాలసిస్ సెంటర్లు పనిచేయకపొవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారే తప్ప ఏమాత్రం నివారణ పనులు జరగడం లేదున్నారు. దీనిపై కలెక్టర్ దృష్టిసారించి తక్షణ సహాయ చర్యలు అందించాలన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదుకోవాలని కోరుతూ లేఖలు రాశామన్నారు,కేంద్ర ప్రభుత్వం తిత్లీ తుఫాన్ జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహయం రూ.1200 కోట్లు ఏపీకి అందించాలని సీపీ ఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

నేడు జర్నలిస్టుల దసరా సంబరాలు
జగదాంబ, అక్టోబర్ 16: నిరంతరం మానసిక ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు,వారి కుటుంబ సభ్యులకు ఆటవిడుపును కలిగించేందుకు ఈ నెల 17వ తేదిన సుర్యాబాగ్‌లోని వైశాఖి జల ఉద్యానవనంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహా విశాఖ నగర శాఖ దసరా సంబరాలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగర శాఖ అధ్యక్షుడు పి.నారాయణ్ తెలిపారు. మంగళవారం సీతమ్మధార నార్లవెంకటేశ్వర భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ వేడుకులు ప్రారంభమవుతాయన్నారు. ఈ వేడుకులకు నగరంతో పాటు, గాజువాక, పరవాడ,గోపాలపట్నం, మధురవాడ,్భమిలీ, పద్మనాభం,సింహచలం, పెందుర్తి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు వారి కుటుంబసభ్యులు హాజరై ఈ సంబరాల్లో పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి అనురాధ, నాయుడు, సాంబశివరావు ఇతర నాయకులు పాల్గొన్నారు.

చెత్త తరలింపుకు స్థానికులు సహకరించాలి
జగదాంబ, అక్టోబర్ 16: పారిశుధ్య కార్మికులంతా సమ్మె చేపడుతున్న నేపథ్యంలో చెత్తను రవాణా చేసే వాహనాలను, కార్మికుల పనులను అడ్డుకొవద్దని, జీవీ ఎంసీకి సహకరించాలని కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం నాల్గొవ జోన్ 39వ వార్డుకు చెందిన తెనే్నటి నగర్,మాధవధారలో పేరుకుపోయిన చెత్త, దుర్గంధభూయిష్టంగా ఉన్న ప్రదేశాలను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించి చెత్తను తొలగించారు. గత 13 రోజులుగా కార్మికులంతా సమ్మెలోకి వెళ్లడంతో చెత్త వీపరితంగా పేరుకుపోయిందని, తాత్కాలిక కార్మికులతో ఆయా చెత్తను తొలగించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మిక నాయకులు, అవుట్ సోర్సింగ్ కార్మికులపై అగ్రహాం వ్యక్తం చేశారు. వార్డుల్లో ఉన్న చెత్తను తరలించేలా పర్యవేక్షించారు. అన్ని వార్డులకంటే నాల్గొవ జోన్ 39వ వార్డులోనే సమస్యత్మాకంగా ఉన్నందున తానే స్వయంగా పర్యవేక్షించవలసి వచ్చినట్లు పేర్కొన్నారు. కార్మికులకు వాస్తవ పరిస్థితి, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై వివరించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ విజయ మనోహార్, జోనల్ కమిషనర్ రమణమూర్తి, ఎ ఎంహెచ్‌వో మురళీమోహన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ చిట్టిబాబు, స్థానిక నాయకులు సనపల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.