క్రైమ్/లీగల్

ప్రైవేటు స్కూల్‌బస్ ఢీకొని చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, అక్టోబర్ 23: ఒక ప్రైవేటు స్కూల్ బస్ ఒక చిన్నారని ఢీకొనడంతో ఆ చిన్నారి చికిత్సపొందుతూ మృతిచెందిన వైనమిది. దానికి సంబందించిన వివరాలు క్రైం ఎస్‌ఐ శ్రీను అందించిన ప్రకారం భీమిలి మండలం నేరళ్లవలసకు చెందిన జీరు అప్పలరాము కూలి పనులు చేసుకుంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు కలరు. ఎప్పటిలాగేనే మంగళవారం తన పెద్దకుమార్తె లావణ్య (6)ను స్కూల్‌కు దిగబెట్టినిమిత్తం తన చిన్నకూతురు లహరిని వెంటబెట్టుకుని తీసుకువెళ్లాడు. ఈలోగా కె.నగరంపాలేంకు చెందిన ఒక ప్రైవేటు స్కూల్ బస్ వెనుకవైపుగా వస్తు చిన్నారి లహరిని ఢీకొంది. దాంతో ఆ చిన్నారి రోడ్డుపై పడి గాయాలపాలైంది. వెంటనే స్థానికులు గర్తించి తగరపువలసలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ నయంకాకపోవడంతో 108వాహనం ద్వారా కెజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయింత్రం ఆ చిన్నారి మృతిచెందింది. చిన్నారి తండ్రి, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమిలి ఎస్సై శ్రీను కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

రోడ్డుప్రమాధంలో ఇద్దరికి గాయాలు
ఆనందపురం, అక్టోబర్ 23: మండలంలోని నీలకుండీల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాధంలో ఇద్దరు విద్యార్ధులకు తీవ్రగాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాజువాక చిన కొవ్వాడకు చెందిన పెద్దాడ శివ ప్రేమ్‌కుమార్ మండలంలోని గిడిజాల వద్ద గల సాయిగణపతి పాలిటెక్నిక్ కళాశాలకు తన స్నేహితుడు అశోక్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నం వచ్చారు. తప్పిపోయిన పరీక్షకు సంబందించి పరీక్షఫీజు కట్టుట నిమిత్తం జెరాక్స్ కాపీలు అవసరం అవడంతో గిడిజాల నుండి తిరిగి నీలకుండీల వైపుతన స్నేహితుడితో ఇన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీ కొంది. ఈ ప్రమాధంలో ప్రేమ్‌కుమార్ తలకు, ఆకాష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దాంతో వారిని చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ఈ కేసును సిఐ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ గణేష్ దర్యాప్తుచేస్తున్నారు.