విశాఖపట్నం

ఓటరు నమోదుపై బిఎల్‌ఓలకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, అక్టోబర్ 23: ఓటరు పేరునమోదు, ఓటు హక్కు వినియోగంపై స్థానిక చిట్టివలస కార్మిక సంక్షేమ భవనంలో మంగళవారం బిఎల్‌ఓలకు అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైనమండల తహశల్దారు పి.వి.ఎల్.ఎన్.గంగాధరరావు మాట్లాడుతూ బూత్‌లెవెల్ అధికారులు ప్రతిగడపకు వెళ్లి ఆ ఇంట్లో ఎంతమంది ఓటరుగా నమోదు కాలేదు, ఉన్నవార ఓటుహక్కు వినియోగించుకుంటున్నారా లేదా అలాగే ఇదివరకు ఓటరుగా నమోదు అయినవారు మార్పులు, చేర్పులుకు అవకాశం వినియోగించుకోవాలని ఎలియజెప్పారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ తగరపువలస శాఖ అధ్యక్షులు కొప్పల రమేష్, వైఎస్‌ఆర్‌సిపి పట్టణ అధ్యక్షులు అక్కరమాని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

26 మండల సాధారణ సమావేశం
భీమునిపట్నం, అక్టోబర్ 23: స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 26న మండల సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు ఎండిఓ కె.హరిప్రసాదరావు తెలిపారు. మంగళవారం స్థానికంగా విడుదలచేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొంటు 26న ఉదయం 11గంటలకు ప్రారంభించనున్న ఈ సమావేశంకు ముఖ్యఅతిధిగా ఎంపిపి యరబాల కృష్ణవేణి హాజరు కానున్నారన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు అలాగే మండలస్థాయి అధికారులు వారి శాఖయొక్క పూర్తిస్థాయి సమాచారంతో విధిగా సమావేశానికి హాజరు కావాలని ఎంపిడిఓ కోరారు.

ప్రేక్షకులను రంజింపజేయడమే ప్రధానం
* సంగీత దర్శకుడు తమన్
సింహాచలం, అకవ్టబర్ 23: ప్రేక్షకులను రంజింపజేయడమే ప్రధానమని ప్రముఖ సంగీత దర్శకుడు గంటసాల సాయి శ్రీనివాస్ (తమన్) అన్నారు. మంగళవారం ఆయన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. కిక్ సిమాతోతన సినీ సంగీత ప్రయాణం మొదలైందని అన్నారు. ఇంత వరకు 64 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించానని ఆయన చెప్పారు. కిక్, దూకుడు, బిజినెస్‌మేన్ వంటి అనేక సినిమాలకు మంచి పేరు వచ్చిందని ఆయన అన్నారు. తాజాగా అరవింద సమేత చిత్రం ద్వారా మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యానని ఆయన చెప్పారు. సాహు, అమర్ అక్బర్ ఆంథోనీ, వెంకీ మామా సినిమాలకు సంగీతం అందిస్తున్నానని ఆయన వెల్లడించారు. అంతకు ముందు ఆయన సింహాద్రినాధుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.

దుర్గాదేవికి విశేష పూజలు
గాజువాక, అక్టోబర్ 23: పారిశ్రామిక ప్రాంతంలోని పలు చోట్ల జరుగుతున్న దుర్గాదేవి నవరాత్రి మహోత్సోవాల్లో పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి విశేషంగా పూజలు చేశారు. మహిళలు కుంకమార్చనలు అమ్మవారికి అందించారు. మంగళవారం జీవిఎంసి 58వ వార్డు సిద్ధార్ధనగర్‌లో జరుగుతున్న దుర్గాదేవి పూజా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అన్నసమారాధనను ఆయన ప్రారంభించగా సుమారు 2వేల మంది భక్తులు పాల్గొన్నారు. అదే విధంగా స్ధానిక మహిళ అమ్మాడమ్మ సహకారంతో నిరుపేద మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలిరెడ్డి నాగేశ్వరరావు, సుహసిని, గోపాలకృష్ణ, మధు, భాస్కరరావు, లక్ష్మి, నాని తదితరులు పాల్గొన్నారు.

50వ వార్డులో పరిధిలో..
50వ డివిజన్ ప్రియదర్శినికాలనీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవిని వాంబే కాలనీ, అశోకనగర్, దిబ్బపాలెం, సంజీవకాలనీ, వికాస్‌నగర్, బాపూజీనగర్, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీ తదితర గ్రామాల భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని అర్చనలు, అభిషేకాలను, కుంకుమార్చన నిర్వహించారు.్భవానీ భక్తులు అమ్మవారికి పూజలందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ్ కమిటీ ప్రతినిధులు, పల్లవ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమ్మిడి ఆనందరావు, రొయ్యి విశ్వనాధం, అంగ శ్రీనివారావు, దున్న తులసీరావు తదితరులు పాల్గొన్నారు.

అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
గాజువాక, అక్టోబర్ 23: అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎపి కనీస వేతనాల సలహా సంఘం చైర్మన్ రఘుపతుల రామ్మోహన్‌రావు అన్నారు. ఉక్కులో మంగళవారం అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టాయని అన్నారు. జిల్లాలోని వివిధ పరిశ్రమల్లోనే కాకుండా ఇతర సంస్ధల్లో కూడా వందలాది మంది అసంఘటిత రంగ కార్మికులు పని చేస్తున్నారని అన్నారు. అయితే కార్మికులకు కార్మిక చట్టం ప్రకారం జీతాలు అందకపోగా ఇతర సదుపాయాలకు కూడా నోచుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు చట్టాల గురించి తెలియాలని, ముఖ్యంగా కనీస వేతనాల చట్టం అమలుపై వారిలో అవగాహన కల్పించాలన్నారు. కార్మికుల్లో చైతన్యం వచ్చినపుడే చట్టాలు సక్రమంగా అమలవుతాయని పేర్కొన్నారు. కార్మిక సంఘాల నాయకులు అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికపుడు అధికారుల, పాలకుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ సమావేశంలో టిఎన్‌టియుసి, ఎఐటియుసి, సిటు, బిఎంఎస్, ఇంటక్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.