విశాఖపట్నం

సరికొత్త ఆవిష్కరణల వేదిక ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 23: ఎనె్నన్నో ఆవిష్కరణలు. సరికొత్త ఆలోచనలు. ఇంటిని స్మార్ట్‌గా ఎలా ఉంచుకోవాలో సూచిస్తారు. స్మార్ట్ టెక్నాలజీతో నకిలీ విత్తనాలను గుర్తించి ముందుగానే నష్టపోకుండా నిలువరించే పరికరాలు. వాతావరణం ఎలా ఉంది. వర్షం ఎప్పుడు కురుస్తుంది. భూగర్భ జలాల వివరాలు ఎప్పటి కప్పుడు స్మార్ట్ఫోన్‌లో సమాచారం అందే సదుపాయం. ఇక యంత్రాలు, రోబోలతో విద్యాబోధన. ఇలా ఒకటేమిటి మనిషి మనుగడకు అవసరమయ్యే అన్నింటినీ కాలు కదపకుండా అందుకునే సాంకేతిక లోకం ఆవిషృతమైంది. ఎవరికి ఏది అవసరమో దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో వివరిస్తూ సాగింది ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్. నగరంలోని నోవాటెల్ హోటల్‌లో రెండు రోజుల పాటు జరిగే ఫిన్‌టెక్ ఫెస్టివల్-2018ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా వివిధ సాంకేతిక అంశాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది.
స్మార్ట్‌హోంతో ఎంతో సుఖం
ఆంతర్ స్మార్ట్‌హోం పేరిట ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇంట్లో సదుపాయాలకు స్మార్ట్ హంగులు చేకూర్చింది. ఇంట్లో విద్యుత్ పరికరాలు మొదలు, డోర్ కర్టెన్లు సైతం కాలు కదపకుండా అంతేకాదు చుట్టుపక్కల లేకుండానే నచ్చినట్టు మార్చుకోవచ్చు. విద్యుత్ దీపాలు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా కేవలం చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. భద్రతా పరంగా ఇంటికి తాళం వేయాలన్నా ఫోన్‌లో మీట నొక్కితే సరిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు లేని ఆంతర్ స్మార్ట్ హోంను అందుబాటులోకి తెచ్చుకుంటే సరిపోతుందని ఫౌండర్ సీఈఓ రజనీష్ వసంత తెలిపారు. ఆంతర్ స్మార్ట్ హోం మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు, అన్ని సౌకర్యాలు అరచేతిలో ఉన్నట్టే. రెండు పడకగదుల ఇంటిని స్మార్ట్‌హోంగా మార్చుకోవాలంటే రూ.25వేలు, మూడు పడకగదుల ఇంటికి రూ.50వేలు వ్యయమవుతుందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రభుత్వం అనుమతిస్తే విశాఖలో కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సుమారు రూ.2 కోట్లు మేర పెట్టుబడి పెట్టి ఆంతర్ స్మార్ట్‌హోంను విస్తరించాలన్నది తమ ఉద్దేశంగా పేర్కొన్నారు.
పాఠాలు చెప్పే రోబో
ఫైనల్ యాస్పెక్ట్స్ డిజీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కూడిన పలు అంశాలకు పరిష్కారం చూపిస్తున్నారు. రైతులకు ఉపకరించే పరికరాలతో నకిలీ విత్తనాలను గుర్తించి ముందుగానే అప్రమత్తమయ్యే పరికరాలు ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. నాణ్యమైన విత్తనాలతో అధిగదిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి సాధించేలా రైతుకు సాంకేతిక సహకారం అందిస్తారు. ఇక విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు రోబోలు కూడా ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. కంపెనీల్లో సమాచారం చేరవేయడం, సమాచారం పరస్పర మార్పిడి వంటి అంశాలకు బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగిస్తారు. నగరంలోని పీఎం పాలెంలో ఈ సంస్థ ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఖచ్చితమైన వాతావరణ సమాచారం
రైతుకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం ఇచ్చే పరికరాలను అందించే సెన్‌కార్ప్ తమ సంస్థ స్టాల్‌ను ఫిన్‌టెక్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసింది. వర్షపాతం, వాతావరణంలో తేమ శాతం, గాలుల తీవ్రత వంటి అంశాలు ఎప్పటి కప్పుడు తెలుసుకునే వీలుంది. మొబైల్ ఫోన్‌లో యాప్ సహయంతో వాతావరణ సమాచారాన్ని స్పష్టంగా అంచనా వేయవచ్చు. తద్వారా రైతుకు లబ్దిచేకూరుతుందని సంస్థ అంతర్జాతీయ బిజినెస్ డైరెక్టర్ సెడ్రిక్ డిబోన్ట్ వెల్లడించారు.