విశాఖపట్నం

వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 8: వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ పంపుసెట్లు ప్రత్యక్షం కానున్నాయి. ఇక నుంచి వీటి సంఖ్య అనూహ్యంగా పెరగనుంది. బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే సోలార్ పంపుసెట్ల వాడకాన్ని ఏపీలో అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనినే ఇపుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కామ్) యాజమాన్యాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) యాజమాన్యం అయిదు జిల్లాలకు సంబంధించి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు వీటిని ఏర్పాటు చేసుకునే విధంగా వీరిలో అవగాహన కల్పించనుంది. సంస్థ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబందించి రెండు లక్షలకు పైగానే వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. విశాఖ జిల్లాలకు 27వేల వరకు వ్యవసాయ పంపుసెట్లు ఉండగా, ఇందులో సోలార్ పంపుసెట్లు ఇప్పటికే రెండు వేలకు పైగానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే వీటిని జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 5హెచ్‌పీ, 3హెచ్‌పీ సామర్ధ్యం కలిగి ఉండే పంపుసెట్లు ఉండగా ఇక నుంచి 10హెచ్‌పీ, 20 హెచ్‌పీ సోలార్ పంపుసెట్లను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ అధికారులు నిర్ణయించారు.
* బహుళ ప్రయోజనాలివే...
సామర్ధ్యం పెంచుతూ అందుబాటులోకి తీసుకువచ్చే సోలార్ వ్యవసాయ పంపుసెట్ల వలన ప్రధానంగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. వ్యవసాయ క్షేత్రాల్లో గ్రిడ్‌కు అనుసంధానిచ్చే విధంగా ప్రత్యేక మీటర్లను సోలార్ పంపుసెట్లకు అమర్చడం జరుగుతుంది. దీనివల్ల సౌరశక్తిని వ్యవసాయ క్షేత్రాలకు ఉపయోగిస్తూనే మిగులు విద్యుత్‌ను గ్రిడ్ ద్వారా ఈపీడీసీఎల్‌కు విక్రయించే సౌలభ్యాన్ని సంస్థ కల్పిస్తుంది. అయితే ఇదే గ్రిడ్ ద్వారా విద్యుత్‌ను వాడుకునేందుకు అవకాశం లేదు. ఒకే మార్గంలో గ్రిడ్ ద్వారా సౌరశక్తిని మాత్రం అమ్ముకునే వీలుంటుందని సంబందితాధికారి ఒకరు తెలిపారు. అలాగే ఈ సరికొత్త విధానం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. వ్యవసాయ క్షేత్రాల్లో సౌరశక్తిని అవసరం ఉన్నపుడే రైతులు ఉపయోగించుకునే వీలుంటుంది. వ్యవసాయ నీటి అవసరాన్ని దీని ద్వారా తీర్చుకోవచ్చు. ప్రస్తుతం ఏడు గంటల వ్యవసాయ విద్యుత్ అమల్లో ఉన్నా సంస్థ సరఫరా చేసినపుడే వ్యవసాయ క్షేత్రాలకు నీటిని పొందుతున్న పరిస్థితులుంటున్నాయి. అదే సోలార్ వ్యవసాయ పంపుసెట్లతో ఇటువంటి సమస్యలను అధిగమించవచ్చు. వీటన్నింటి కంటే కూడా వేసవి సీజన్లలో విద్యుత్ డిమాండ్‌కనుగుణంగా అవసరమైనంత మేర సోలార్ పవర్ ప్రత్యామ్నాయం చేసుకోవచ్చు కూడా. రైతులకు గ్రిడ్ ద్వారా అమ్మడం వలన ఆర్ధికంగా బలపడటంతోపాటు అవసరం ఉన్నపుడు దీనిని ఉపయోగించుకుంటూనే సదుపాయం కలుగుతుంది.
* విశాఖ జిల్లాలో రెండు వేలకు పైగానే...
జిల్లాలో సౌర విద్యుత్ ద్వారా వ్యవసాయ పంపుసెట్లు విద్యుదీకరణకు సంబందించి జిల్లావ్యాప్తంగా 2189 మంది రైతులు ధరఖాస్తులు చేసుకోగా, ఇందులో అనకాపల్లి-505, నర్సీపట్నం-1314, పాడేరు-35, విశాఖ జోన్-2లో తొమ్మిది, జోన్-3లో 326 మొత్తం 2189 దరఖాస్తులు అందాయి. ఇందులో అన్నింటికీ అనుమతి లభించగా, నగదు చెల్లించిన రైతులు 1867 వరకు ఉన్నారు. ఇంకా 322 మంది మాత్రమే నగదు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు సౌర విద్యుత్ శక్తి ద్వారా 1816మంది రైతులు పంపుసెట్లను అమర్చుకోగలిగారు. మరో 51 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
* సోలార్ వ్యవసాయ పంపుసెట్ల విస్తరణ చర్యలు...
రెండు వేల వరకు ఉండే సోలార్ వ్యవసాయ పంపుసెట్లను మండల కేంద్రాల్లో పెంచేందుకు వీలుగా తొలుత రైతులకు వీటిపై ఉన్న అపోహాలను తొలగించాలని, తద్వారా అవగాహన కార్యక్రమాలను విస్తృతపర్చాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. పలు సబ్‌స్టేషన్ల పరిధిలో కూడా వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

ఇవీఎంలను ఇసీఐఎల్, బిఐఎల్ కంపెనీలకు పంపాలి
* కలెక్టర్లకు ముఖ్య ఎన్నికల అధికారి సిసోడియా ఆదేశాలు
* వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
విశాఖపట్నం, నవంబర్ 8: 2012-14 సంవత్సరాల్లో తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఇవీఎం) అన్నింటిని ఇసిఐఎల్, బిఇఎల్ కంపెనీలను పంపాల్సిందిగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆర్‌పి సిసోడియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలక్ట్రోరల్ రోల్ తదితరాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో సార్వథ్రి ఎన్నికల రానున్న నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న ఇవీఎంలకు బదులుగా అభివృద్ధి చెందిన టెక్నాలజీతో గల ఇవిఎంలను ఉపయోగించడం జరుగుతుందన్నారు. అలాగే ఓటర్ల జాబితాను సంబందించి క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఇవిఎంలు ఉన్న గోడౌన్‌లను పొలిటికల్ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం నుండి తెరిచి వాటన్నింటినీ స్కాన్ చేయడం, ఫొటోలు తీసి ట్రాకింగ్ చ ఏసే పనులను మొదలు పెడతామని దీనికి సంబంధించి సీనియర్ డిప్యూటీ కలెక్టర్‌కు బాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు. అనంతరం వీటన్నింటిని సంబందిత కంపెనీలకు 15 రోజుల్లో పంపడం జరుగుతుందని సీఇసీకి తెలిపారు. 2019 ఓటర్ల లిస్టు రివిజన్‌కు సంబంధించి వచ్చిన క్లయిమ్‌లు, అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీలోపు డిస్పోజ్ చేయనున్నామన్నారు. ఇప్పటి వరకు ఫారం-6లో 1,63,944 రాగా, ఫారం 6ఏ (ఎన్‌ఆర్‌ఐ)లో 186, ఫారం-7 తొలగింపులకు సంబంధించి 16,050, ఫారం-8 సవరణలకు సంబందించి 8,976, ఫారం 8ఏ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కేంద్రాల మార్పుకు సంబంధించి 9,87 మొత్తం 1,97 లక్షల ఆన్‌లైన్, క్లయిమ్స్ వచ్చాయన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.