విశాఖపట్నం

కార్తీక పూజలకు సిద్ధమైన అప్పికొండ సోమేశ్వర ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, నవంబర్ 8: చారిత్రక ప్రాధాన్యత కలిగిన శైవ క్షేత్రాల్లో ఒక్కటిగా అప్పికొండ సోమేశ్వర ఆలయం కార్తీక మాసం పూజలకు సిద్ధం అయింది.చరిత్ర కలిగిన అప్పికొండ సోమేశ్వర ఆలయానికి కార్తీకమాసంలో భక్తుల తాకిడి అధికం అయింది. కార్తీకమాసం నెల రోజులు సోమేశ్వరుడ్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. చారిత్రాత్మక శివాలయంగా వెలుగొందుతున్న అప్పికొండ సోమేశ్వర ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూ వస్తుంది. అప్పికొండ తీరంలో వెలిసిని సోమేశ్వరుడు వేలాది మంది భక్తులకు ఇలవేల్పుగా పిలుచుకుంటారు. ఆలయం పరిసర గ్రామాల ప్రజల్లో ప్రతీ కుటుంబానికి ఒక్కరు సోమేశ్వరుడు నామకరణ చేసుకుంటారు. శతాబ్ధాకాలం నాటి అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయం విశాఖపట్నం నడిబొడ్డిన జివిఎంసి 55వ డివిజన్ అప్పికొండ సముద్ర తీరంలో వెలిసింది. కార్తీకమాసం, మహాశివరాత్రి రోజుల్లో సోమేశ్వర ఆలయానికి భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది.దేవాదాయయ ధర్మాదాయశాఖ ఆధీనంగా గల పురాతన సోమేశ్వరస్వామి ఆలయం అభివృద్ధి అంతంత మాత్రమే. అయినప్పటికీ భక్తులకు మాత్రం సోమశే్వరుడు కొంగుబంగారంలా నిలుస్తున్నారు. ఆలయ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, అభివృద్ధి కమిటీ పాటు ట్రస్టీలు పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. ట్రస్టు బోర్డును మాత్రం ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ట్రస్టీ పర్యవేక్షణల్లో దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు ఆలయ నిర్వహణను చేపడుతారు. దేశంలోనే అతి పురాతన ఆలయంగా ప్రాచూర్యం పొందిన సోమేశ్వరుడ్ని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ధంలో కపిల తీర్ధమహిర్షి దీక్షతో అప్పికొండ సాగర తీరం అంచున వెలసిన సోమేశ్వరుడుకి భక్తుల ఆదరణ మెండుగా ఉంది. కపిలమహర్షి దీక్షతో 101 లింగాలు ఏర్పడాల్సి ఉండగా తెల్లవారే సరికి ఒకే ఒకలింగం లోటుగా ఏర్పడడం, లోటుగా ఉన్న ఒక లింగాన్ని మహార్షి అప్పుగా తీసుకోవడం కారణంగా అప్పట్లో ఈ ప్రాంతాన్ని అప్పుకొండగా పిలిచేవారని చారిత్రక ఆధారాల బట్టి తెలుస్తుంది. రానురాను అప్పుకొండ అప్పికొండగా మారిందని పూర్వీకులు చెబుతుంటారు. అప్పికొండ సాగర తీరంలో అహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అప్పికొండ సోమేశ్వర ఆలయం క్రీస్తు పూర్వ 6,11వ శతాబ్ధాల్లో చోళులు, విజయనగర రాజులు ఆదరణతో ఎంతో అభివృద్ధి చెందిందని ఇక్కడ లభించిన శిలాశాసనాల బట్టి రుజువవుతుంది. సుమారు 150 ఎకరాల విస్తీర్ణం (మాన్యం) కలిగిన అప్పికొండ సోమేశ్వర ఆలయం విశాఖ ఉక్కు కర్మాగారం రాకతో నేడు 26 ఎకరాలకే పరమితమైందని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణంతో ఆప్పికొండ సోమేశ్వర ఆలయానికి ఎంతో ప్రధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. దేశ,విదేశాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి సోమేశ్వరుడుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 1992లో అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవాదాయ,్ధర్మాశాఖ అదీనంలోకి వెళ్లడంతో అప్పటి నుండి ఆలయం అభివృద్ధికి అధికారులు నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పాలవలసలో హిందూజా పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగినందున అప్పికొండ సోమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. భక్తుల కొంగు బంగారమైన అప్పికొండ సోమేశ్వర ఆలయం కమిటీ పెద్దలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీకమాసంలో ఆలయానికి భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది. ప్రధానంగా కార్తీకమాసం సోమవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. సోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని ట్రస్టు బోర్డు ప్రతినిధులతో పాటు దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతి పురాతన ఆలయంగా ఉన్న అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయానికి గత ఏడాది కాస్త మరమ్మతులు చేయించి రంగులు వేయించారు. కార్తీక మాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులకు చేరుకునేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. కూర్మన్నపాలెం నుండి స్టీల్‌ప్లాంట్ ప్రధాన రహదారి మీదగా మెయిన్‌గేటును దాటుకుని ఆలయానికి చేరుకోవాలి. ప్రధానంగా కార్తీకమాసంలో అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో వన భోజనాలకు వచ్చే భక్తులు అధికంగా ఉంటారు. ఆలయానికి అనుకుని ఉన్న తీరంలో భక్తులు వన భోజనాలు చేసి సరదా గడుపుతారు.

వైసీపీ నియోజకవర్గ సమావేశం
గాజువాక, నవంబర్ 8: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ మహిళ కమిటీ సమావేశం గురువారం వైకాపా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి వైకాపా నియోజకవర్గ మహిళ ప్రతినిధి పల్లా చినతల్లి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా వైకాపా నగర మహిళ ప్రతినిధి గరికిన గౌరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వైకాపాని అధికారంలోకి తీసుకు రావడంతో పాటు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసే విధంగా మహిళలు కష్టించి పని చేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై ప్రచారాన్ని విసృతం చేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే వచ్చే లాభాలు గురించి ప్రజలకు వివరించాలన్నారు. గాజువాక నియోజకవర్గంలో గల ప్రతీ వార్డులో సమావేశాలను నిర్వహించి ప్రచారాన్ని విసృతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వైకాపా గాజువాక నియోజకవర్గ సమన్వకర్త తిప్పల నాగిరెడ్డి సారధ్యంలో పార్టీని మరంత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలంతా ఐక్యంగా జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు శక్తివంచన లేకుండా పని చేయాలని గౌరి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైకాపా మహిళ ప్రతినిధులు కల్పన,కాకి నిర్మలారెడ్డి, శాంతికుమారి, తులసి, లక్ష్మి, కనకమహాలక్ష్మి, శ్రీదేవి, అన్నపూర్ణ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామిక ప్రాంతంలో వేడుకగా దీపావళి
గాజువాక, నవంబర్ 8: దీపావళి పర్వదినాన్ని పారిశ్రామిక ప్రాంత ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. దీంట్లో భాగంగా ప్రజలు లక్ష్మిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చీకటి పారద్రోలి వెలుగును నింపేందుకు ప్రజలు బాణాసంచాను కల్చారు. దీంతో పారిశ్రామిక ప్రాంతం రంగురంగులు మతాబుల వెలుగుల్లో మంగళవారం రాత్రి దర్శనమిచ్చింది. రంగురంగుల తారాజువ్వులు ఆకాశంలో కాంతులను వెదజల్లాయి. ఆకాశ దీపాలు గగన మారంల్లో చక్రర్ల కొట్టాయి. మంగళవారం సాయంత్రం పారిశ్రామిక ప్రాంతంలో గల అన్ని వీధులు టాపాసుల పేళ్ళులతో నిండి పోయాయి. దేశ అత్యున్న న్యాయ స్థానం జారీ చేసిన ఉత్తర్వుల పారిశ్రామిక ప్రాంతంలో అమలు జరగలేదు. రాత్రి 11 గంటల వరకు బాణా సంచా కాల్పులు ప్రజలు జరుపుకున్నారు. ఒక వైపు కాలుష్యాన్ని పెంచే బాణాసంచా కాల్పులను విడిచి పెట్టాలని ప్రజాసంఘాలు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వాటిని పెడ చెవిని పెట్టి బాణాసంచా సామాగ్రిని అధికంగా కాల్చారు. ఈ ఏడాది బాణాసంచా ధరలు అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు వెనకడుగు వేయలేదు. జిఎస్‌టితో పాటు వ్యాపారులు పెంచిన ధరలు మతాబులు కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పెట్టాయి. దీపావళిని పురష్కరించుకుని పారిశ్రామిక ప్రాంతంలో అనేక ఆలయాలు భక్తులతో నిండి పోయాయి. ప్రధానంగా శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. పలు దేవాతాలయాలు సైతం భక్తులతో నిండి పోయాయి. దీపావళితో కార్తీకమాసం ప్రారంభం కావడంతో శైవ క్షేత్రాలు బిజీగా కనిపించాయి.