విశాఖపట్నం

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 8: విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణను పాటిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని విశాఖ నగర ఎస్సీ, ఎస్టీ సెల్ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ కాజల్ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, జిల్లా న్యాయసేవాధికార సంస్థల సంయుక్తంగా గురుద్వారా జంక్షన్‌లోని వసంత బాల విద్యోదయ హైస్కూల్ సమావేశ మందిరంలో గురువారం పాఠశాల విద్యార్థులకు ‘క్రమ శిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహిద్దాం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల విఘాతం కలగకుండా చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం లాంటి ఎన్నో సంస్థలు సంఘటిత పరుస్తున్నారన్నారు. ఏదైనా ఆపదలో ఉన్న బాలలు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కిగానీ, పోలీస్ కమిషనరేట్‌లో పొందుపర్చబడ్డ ప్రత్యేక వాట్స్యాప్‌కు సమాచారాన్ని చేరవేసి అక్రమార్కుల భరతం పట్టాలన్నారు. ఇదే స్పూర్తిగా చక్కని భవితకు నిర్మాణాత్మక మార్గదర్శకాలు రూపొందించుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. జిల్లా సీనియర్ సివిల్‌జడ్జి ఎస్.దామోదర్‌రావు మాట్లాడుతూ బాల్యం నుంచే భవిష్యత్ స్వర్గమయింగా తయారయ్యేందుకు తల్లిదండ్రులు, గురువులు, సమాజంలోని సత్ప్రవర్తన కల్గిన వ్యక్తులు సూచనలు, సలహాలతోనే ప్రణాళికాయుతంగా అడుగులు వేయాలన్నారు. క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్నో బాలల చట్టాలు బాసటగా నిలబెడతాయన్నారు. వాటి పనితీరును విద్యార్థులకు సాదాహరణలతో వివరించి చక్కని అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ వై.సునంద మాట్లాడుతూ సాంకేతిక పెరుగుదలను దృష్టిలో ఉంచుకొకుండా ఎదిగేకొద్ది ఒదిగి ఉంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. సీఆర్‌ఫీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గొండు సీతారామ్ మాట్లాడుతూ పిల్లల మనస్సులపై మంచి మార్గదర్శకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాకి చక్ని సందేశాలను బలల మస్థిస్కాలలో నిలపాలని, క్రమశిక్షణతో సుచిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దాలన్నదే తమ సంస్థ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరోసైకియాట్రస్ట్ డాక్టర్ రమేష్‌బాబు, సీ ఆర్‌ఫీ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శకుంతల, సభ్యులు వేణుగోపాల్, పద్మావతి, పాఠశాల కరస్పాండెంట్ సురేష్, హెచ్ ఎం కెవి లక్ష్మీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తిత్లీ తుఫాన్ సహాయార్థం మిస్‌వైజాగ్-2018 పోటీలు
* కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి గంటా
జగదాంబ, నవంబర్ 8: శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ బాధితుల సహాయార్థం వచ్చే నెల 15న నగరంలోని మిస్‌వైజాగ్-2018 పోటీలను నిర్వహించనున్నామని నిర్వాహకులు అజయ్ ఆగర్వాల్ తెలిపారు. నగరంలో గురువారం ఓ హోటల్‌లో మిస్‌వైజాగ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా అందాల పోటీల వేడుక, ఎందరో ఉత్సాహపూరితులు ఆసక్తిగల యువతలను మోడలింగ్, చిత్ర పరిశ్రమలలో అవకాశాలు కల్పించే విధంగా చేపట్టాలన్నారు. మిస్‌వైజాగ్ కార్యక్రమానకి సంబంధించిన టిక్కెట్ల ఆదాయం మొత్తాన్ని తిత్లీ బాధితుల సహాయనిధికి అందజేయడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో మొత్తం 22 మంది మోడల్స్ పోటీల్లో పాల్గొంటారని, తుది పోటీ మూడు రౌండ్లుగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్ ర్యాంప్‌వాక్ చేశారు. ఆసక్తి ఉన్న 18 నుంచి 25 ఏళ్ల వయస్సుగల వారు దరఖాస్తులు చేసుకొవాలన్నారు. ఈ కార్యమ్రంలో సిని నటుడు అశోక్‌కుమార్, పుచ్చా విజయ్‌కుమార్, పలువురు మోడల్స్ తదితరులు పాల్గొన్నారు.

డిసెంబర్ 23 నుంచి 25 వరకూ క్రెడాయి ప్రోపర్టీ ఎక్స్‌పో
జగదాంబ, నవంబర్ 8: క్రెడాయి విశాఖ చాఫ్టర్ ఆధ్వర్యంలో వచ్చే నెల 23 నుంచి 25వ తేది వరకూ మూడు రోజుల పాటు నగరంలోని ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో ప్రొపర్టీ ఎక్స్‌పో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు క్రెడాయి చాఫ్టర్ చైర్మన్ జీవీవీ ఎస్ నారాయణ అన్నారు. నగరంలో గురువారం ఓ హోటల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో నిర్మాణ రంగం మరింత అభివృద్ధి చెందాలంటే అనేక మార్పులు అవసరమన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పరంగా నిర్మాణ రంగాల వారికి అవసరమైన అనుమతులను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా ఇసుక కొరత విషయంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేపట్టే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామన్నారు. నిర్వాకులు కోటీశ్వరరావు, సాయిరాజులు మాట్లాడుతూ ఈ ఎక్స్‌పోలో 225 స్టాళ్లును ఏర్పాటు చేయడంతో పాటు,నిర్మాణాలు చేపట్టే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ ఒకే చోట ఉంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలంతా సద్వినియోగం చేసుకొవాలన్నారు. కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, క్రెడాయి విశాఖ చాఫ్టర్ అధ్యక్షుడు కోటీశ్వరరావు, సదస్సు కన్వీనర్ బి.శ్రీనివాసరావు, కార్యదర్శి సాయిరాజు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.