విశాఖపట్నం

భూ కుంభకోణంపై సీబీ ఐతో దర్యాప్తు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 8: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంపై తక్షణమే సీబీ ఐతో విచారణ నిర్వహించి నిజనిజాలను తేల్చాలని వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలో గురువారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షలాది రుపాయాల విలువైన భూములు దోపీడీకి గురైన నేపథ్యంలో సిబీ ఐతో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా స్పెషల్ ఇనిస్విటిగేషన్‌ను (సిట్) ఏర్పాటు చేసి విచారించారని, ఆయా విచారణలో అనేక మంది టీడీపీ నాయకులపై అవినితీ ఆరోపణలు వినిపించినా నేడు మాత్రం ఆయా సిట్ నివేదికలో ఒక్క టీడీపీ నాయకుని పేరు కనీసం లేకపోవడమేమిటిని ప్రశ్నించారు. విశాఖ ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే తక్షణమే సిబీ ఐతో విచారణ చేపట్టాలన్నారు. అంతేకాకుండా ఈ భూకుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోంటున్న అధికార పార్టీకి చెందిన కీలక సుత్రధారులకు సిట్ క్లిన్‌చిట్ ఇచ్చేసిందని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల చేసిన భూదోపీడీలపై కనీసం వారి పాత్ర ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదును ఏమాత్రం పరిగణలోనికి తీసుకొలేదున్నారు. విశాఖ భూకుంభకోణానికి సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావుపై సాక్షాత్తు తోటి మంత్రి అయ్యన్నపాత్రుడే ఆరోపించి, దానికి సంబంధించిన ఆధారాలను సైతం సిట్ అధికారులకు అందించినా, నేడు దర్యాప్తులో మంత్రి గంటాకు, ఆయన అనుచర బృందానికి భూముల అవకతవకలు, ట్యాంపరింగ్‌తో సంబంధం లేదని తేల్చిచెప్పడంతో వారికి క్లీన్‌చిట్ ఇచ్చినట్లుయిందన్నారు. సిట్ నివేదికంతా ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నల్లోనే భూకుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెళ్లివెత్తితే ఆయనకు కూడా క్లీన్‌చిట్ ఇచ్చేసిందని, భూకుంభకోణంలో మంత్రి లోకేష్‌ను తప్పించడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజల్ని మోసగించకుండా సీబీ ఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే భుకుంభకోణంపై రీ- ఎంక్వైరీ వేస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నాయకులు తిన్నదంతా కక్కిస్తామన హెచ్చరించారు. * హత్యాయాత్నంపై అవహేళనగా మాట్లాడటం సరికాదు
వైసీపీ అధినేత జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయాత్నం కేసుకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత అవహేళనగా మాట్లాడటం సరికాదుని వైసీపీ నగర అధ్యక్షుడు విజయప్రసాద్ అన్నారు. కోడికత్తి..మోడీకత్తే అంటూ అవహేళనగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారుడు వ్యాఖ్యాలు చేయడం సరికాదున్నారు. జగన్‌పై హత్యాయాత్నంపై సిట్ వేయడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై కూడా సీబీ ఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాలుగున్నర ఏళ్ల పాలన అవినితీ, అక్రమాల పుట్టగా సాగిందని, నిజాయితీ ఉంటే సీ ఎం తన పాలనపై సీబీ ఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. 40 ఏళ్ల అనుభవం ప్రతిపక్షాలపై బురదజల్లేడమేనని ఆయన పనిన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన,దోపీడీ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సమన్వయకర్తలు పైడి వెంకట రమణ మూర్తి, కెకె రాజు, తిప్పల నాగిరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు గరికన గౌరీ,యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్ గాంధీ, అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మేనేజ్ చేశారు
* సిపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్
విశాఖపట్నం, నవంబర్ 8: విశాఖ భూ కుంభకోణంలో అసలు సూత్రదారులను వదిలేసి, అధికారులు, విపక్ష నేతలపై నివేదిక ఇచ్చిన సిట్ దర్యాప్తును సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి తప్పుపట్టారు. విశాఖలో భూ కుంభకోణాలకు సూత్రధారిగా మంత్రి గంటా శ్రీనివాసరావును దృష్టిలో ఉంచుకునే ఫిర్యాదులు అందాయన్నారు. అప్పట్లో భూకుంభకోణంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి తలొగ్గిన ప్రభుత్వ సిట్ దర్యాప్తునకు సిద్ధ పడిందన్నారు. అయితే వ్యవస్థలను తనదారికి తెచ్చుకోవడంలో దిట్టయిన మంత్రి గంటా శ్రీనివాసరావు తాను బయటపడేందుకు సిట్ దర్యాప్తును సద్వినియోగం చేసుకున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీ ప్రతినిధుల అండ లేకుండా అధికారులు తప్పు చేసేందుకు సాహసించరన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ తెలివిగా వ్యవహరించిందన్నారు. సిట్ దర్యాప్తు ముగిసి తొమ్మిది నెలలు గడచిన తరువాత హఠాత్తుగా నివేదికను మంత్రి మండలిలో తీసుకురావడం చంద్రబాబు వ్యూహంలో భాగమన్నారు. దీపావళి ముందు సిట్ నివేదిక తెచ్చి తన వారికి క్లీన్ చిట్ ఇప్పించునేలా బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నారు. ఇప్పటికైనా సిట్ నివేదిక అంశాలను బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నేతలను తప్పించి సిట్ నివేదిక
* మండిపడ్డ సీపీఎం
విశాఖపట్నం, నవంబర్ 8: విశాఖ భూ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు క్లీన్‌చిట్ ఇచ్చేందుకే సిట్ దర్యాప్తు జరిగిందన్న అనుమానాలు వాస్తరూపం దాల్చాయని సీపీఎం జిల్లా కార్యదర్శి కే లోకనాధం, నగర కార్యదర్శి బీ గంగారావులు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిట్ నివేదికతో పాటు ప్రజల నుంచి వేల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులను బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. నగర శివార్లలో10వేల ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేటు భూముల కబ్జాలు, 55 నిరభ్యంతర పత్రాల జారీ వంటి వాటిని సిట్ గుర్తించిందన్నారు. వేలాది భూ రికార్డులు పరిశీలిచిన సిట్ అధికారులు కొద్దిమంది ప్రతిపక్ష నాయకులను ఇరికించి, అధికార పార్టీకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్ పేర్లను తప్పించారన్నారు. ఇంత పెద్ద భూ కుంభకోణంలో అధికార టీడీపీకి చెందిన ఒక వ్యక్తి కూడా లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తక్షణమే సిట్ నివేదికను బహిర్గత పరచి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాదీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.