క్రైమ్/లీగల్

యారాడ బీచ్‌లో ఆరుగురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక/పెదగంట్యాడ, నవంబర్ 11: నాగుల చవితి సెలవు దినం ఆరుగురు కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. యారాడ బీచ్ మృత్యుకెరటం ఆరుగురు యువకులను కొట్టుకు పోయింది. సముద్రంలో గల్లంతైన ఆరుగురు యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. యారాడ బీచ్ ప్రమాదాలకు నిలయంగా మారిందన్న సంగతి విసృత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఫలితం శూన్యం. యారాడ బీచ్‌లో స్నేహానికి దిగిన అనేక మందిని మృత్యుకెరటాలు పొట్టన పెట్టుకున్న సంఘటనలు కొకొల్లులు. మృత్యువాత పడిన వారిలో అత్యధికంగా యువకులే. మరణమృదగం మోగిస్తున్న యారాడ బీచ్‌లో హెచ్చరిక బోర్డులను, కమ్యూనిటీ గార్డులను ఏర్పాటు చేసిన ఫలితం లభించడం లేదు. సరదా సముద్రంలో స్నానం చేసేందుకు దిగిన 10 మంది యువకుల్లో ఆరుగురు గల్లంతు కాగా నలుగురు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం యారాడ్ బీచ్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి న్యూ పోర్టు ఎస్సై శ్రీనివాసరావు అందించిన వివరాలిలావున్నాయి. విశాఖపట్నం హెచ్‌బికాలనీకి సమీపంలో గల దుర్గానగర్, చాకలిపేట ప్రాంతాలకు చెందిన ఆటో డ్రైవర్ దేవర వాసు, ఐటిఐ చదువుతున్న పేరిడి తిరుపతి, ఎలక్ట్రికల్ పనులు చేసే కోన శ్రీనివాసరావు, దుర్గా, నక్కా గంగేష్, ఎస్.రాజేష్, కొట్యాడ పోలినాయుడు, ఎ.కల్యాణ్, ప్రభుతేజ, హరికృష్ణ, గణేష్, బాలులు స్నేహితులు. వారంతా ఆదివారం నాగుల చవితి పూజలు అనంతరం యారాడ బీచ్‌కు మధ్యాహ్నానానికి చేరుకున్నారు. బీచ్‌లో భోజనం పూర్తి చేసుకున్న అనంతరం 12 మంది యువకులు తీరానికి చేరుకున్నారు. అనంతరం సముద్రంలో స్నేహం చేసేందుకు దిగారు. వారిలో ఇద్దరు యువకులు బట్టలు వద్దే కాపలా ఉన్నారు. 10 మంది యువకులు మాత్రం స్నానానికి దిగారు. స్నానానికి దిగిన 10 మంది యువకుల్లో దేవర వాసు (21) పేరిడి తిరుపతి (21) కోన శ్రీనవాసరావు(21) నక్కా గంగేష్ (17), దుర్గా (21), ఎస్.రాజేష్ (21)లు ఈత రావడంతో వారు కాస్త లోపలికి వెళ్లారు. మిగిలిన నలుగురు యువకులు తీరానికి సమీపంలో స్నానం చేస్తున్నారు. ఈ తరుణంలో మృత్యుకెరటం ఒక్కసారే స్నానం చేస్తున్న 10 మంది యువకులపై విరుచుకు పడింది. దీంతో వారు సముద్రంలో కొట్టుకు పోయారు. తీరానికి సమీపంలో నలుగురు యువకులను స్థానికులు, కమ్యూనిటీగార్డులు రక్షించారు. ఆరుగురు మాత్రం గల్లంతయ్యారు. గల్లంతైన వారు కోసం గజ ఈతగాళ్లు, కమ్యూనిటీగార్డులు సముద్రంలో బోటు సహాయంతో అనే్వషణ చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో అనే్వషణ ముందుకు సాగలేదు. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ను పోలీసులు నిలిపి చేశారు. 12 యువకులు ద్విచక్ర వాహనాల్లో ఇక్కడికి చేరుకున్నారు. 12 మందిలో ఒక్క యువకుడిది ఈ రోజు జన్మదిన కావడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. సంఘటన విషయం తెలుసుకున్న యువకులు కుటుంబీకులు యారాడ బీచ్‌కు చేరుకున్నారు. గల్లంతైన వారు కోసం తీరం వెంబడి కుటుంబీకులు గాలిస్తున్నారు. ఎసిపి రంగరాజుతో పాటు ఇన్‌స్పెక్టర్లు సాయి, సోమశేఖర్లు, సిబ్బంది అక్కడికి చేరుకుని అనే్వషణ చేసినా ఫలితం లేదు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు నేవీ, కోస్ట్‌గార్డు అధికారులు సహాయం కోరారు. అయితే ఆదివారం చీకటి పడిపోవడం వారు సోమవారం తెల్లవారుజాము 6గంటలకు యారాడ తీరానికి చేరుకుంటారని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. గల్లంతైన ఆరుగురు అవివాహితులే. యారాడ బీచ్ యువకులనే అత్యధికంగా మిగేస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. యారాడ బీచ్‌లో ప్రభుత్వం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఇద్దరు కానిస్టేబుల్‌ను పహారీకి ఏర్పాటు చేసి చేతుల దులుపుకుంటుందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అత్యధిక బీచ్ ప్రమాదాలు యారాడలోనే జరుగుతున్నప్పటికీ నివారించే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదన్న అభియోగాలు వేస్తున్నారు. అయితే దీనిపై న్యూపోర్టు పోలీసులు తల్లిదండ్రులు, స్నేహితులు నుండి గల్లంతైన వారి వివరాలను సేకరించడంతో పాటు ఫిర్యాదు స్వీకరించారు.