విశాఖపట్నం

విజయవంతంగా కొనసాగుతున్న పౌష్టికాహార మాసోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, సెప్టెంబర్ 18: స్థానిక ఐసీడీ ఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి . మంగళవారం స్థానిక ఐసీడీ ఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో మండల స్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు పౌష్టికాహార స్టాల్స్‌ను ఏర్పాటు చేసారు. అనంతరం ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని ఏర్పాటు చేసారు. ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించిన స్థానిక ఐసీడీ ఎస్ సూపర్‌వైజర్ సత్యశ్రీ మాట్లాడుతూ పౌష్టికాహారం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. జింక్ పుడ్ పట్ల ఆకర్షితులైన యువత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు. బజార్‌లో దొరికే ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారమే అన్ని విధాలా మేలని తెలిపారు. ఈకార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పుష్ప, గంగా, చిన్నమ్మి తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్
కోటవుటర్ల, సెప్టెంబర్ 18: మండలంలో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎడీవో కళ్యాణి తెలిపారు. మంగళవారం వివిధ గ్రామాల్లో పర్యటించి శానిటేషన్‌పై నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దోమలు రాకుండా గ్రామాల్లో స్ప్రేయింగ్ చేయిస్తున్నామన్నారు. మురికి కాలువలను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నామన్నారు. గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి దోమల వలన వచ్చే వ్యాధులను వివరిస్తున్నారన్నారు. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

దోమలపై దండయాత్ర ర్యాలీ
కోటవురట్ల, సెప్టెంబర్ 18: మండలంలో పాములవాకలో విద్యార్థులు దోమలపై దండయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు దోమలను నివారించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. దోమలు నిర్మూలించడం ద్వారా పలు వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మెనూ అమల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు
సీలేరు, సెప్టెంబర్ 18: ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ అమల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఐటీడీ ఎ డీడీ విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి అక్కడ అమలవుతున్న మెనూను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ అమల్లో ప్రిన్సిపల్ చొరవ తీసుకోవాలన్నారు. ఎవరికీ ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల చుట్టూ కాపౌండ్ వాల్ లేకపోవడంతో పశువులు పాఠశాల ఆవరణలో తిరుగుతున్నాయని, దీని వలన ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రహారీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆశ్రమ పాఠశాలలో సిబ్బంది కొరత ఉందని, మా పరిధిలో ఉన్న 83 పోస్టులు ఖాళీల్లో 65 భర్తీ చేసామన్నారు. స్పెషల్ డీ ఎస్సీ, రెగ్యులర్ డీ ఎస్సీలో ఈపోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 12 హాస్టల్స్‌ను ఆశ్రమ పాఠశాలలుగా మార్చి వేయడం వలన ఈ ఏడాది సిబ్బంది కొరత ఏర్పడిందని డీడీ విజయ్‌కుమార్, ఇపీ ఎస్ పాఠశాలలకు 25 మంది ఉపాధ్యాయుల కొరత ఉందని ఆయన తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో కొత్తగా జరిగే నియామకాల్లో పర్మినెంట్ మహిళా ఉపాధ్యాయులను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.