విశాఖపట్నం

కూలీలు తక్కువగా హాజరైతే షోకాజ్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18:మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులకు కూలీల హాజరు తక్కువైతే సంబంధిత మండల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డ్వామా పథక సంచాలకులు దయానిధిని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనుల సీజన్ ముగిసినా ఉపాధిహామీ పనులకు కూలీలు హాజరు తక్కువగా ఉన్నందుకు కారణాలపై ఆరా తీశారు. వీ మాడుగుల, కే కోటపాడు, మాకవరపాలెం, చీడికాడ, చింతపల్లి, బుచ్చెయ్యపేట తదితర మండలాలకు చెందిన ఏపీఓలు, మండల అభివృద్ధి అధికారులు, ఈఓఆర్డీలను ఆయన నిలదీశారు. కూలీల హాజరు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో కూలీల వేతనాలు చెల్లించే విషయంలో కొన్ని మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. ఎఫ్‌టీఓ పూర్తయిన రెండు రోజుల్లో కూలీల ఖాతాల్లో మొత్తాలు జమకావాలన్నారు. 2015-16లో చేపట్టిన పనుల ఇప్పటికీ పూర్తి కాలేనట్టు గుర్తించిన కలెక్టర్, పనులు ఎప్పటి కప్పుడు ముగించాలన్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ షెడ్ల నిర్మాణానికి పలు పంచాయతీల్లో ఇప్పటికీ స్థలాలు గుర్తించకపోవడం, గుర్తించిన చోట స్వల్ప కారణాల నేపథ్యంలో వాటిని సక్రమంగా లేనట్టు పేర్కొనడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాలు గుర్తించి పంచాయతీలకు అప్పగించాలని ఆదేశించారు. ఎంతో పెద్ద సమస్య ఎదురైతే తప్ప షెడ్‌ల నిర్మాణానికి స్థలాన్ని తిరస్కరించరాదని సూచించారు. పంటకుంటలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కన్వర్జెన్స్ పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జేసీ సృజన, జేసీ 2 డాక్టర్ ఏ సిరి, డ్వామా పీడీ దయానిధి, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

మధురం రాజకుమారి, శామ్యూల్ గానం
ఆరిలోవ, సెప్టెంబర్ 18:ప్రఖ్యాత శాస్ర్తియ సంగీత విధ్వాంసులు రాజకుమారి, ఆమెన్ శామ్యూల్ సంకీర్తనలు మధురంగా గానం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. కవి సామ్రాట్ పురుషోత్తమ చౌదరి ట్రస్టు ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న శాస్ర్తియ సంగీతోత్సవం మంగళవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ముందుగా కాకినాడకు చెందిన శామ్యూల్ స్తుతియింతునా ప్రభో..., నీ చరణాలే నమ్మితి నమ్మితి .. వంటి భక్తి గీతాలు వీనుల విందుగా గానం చేసిన ఆహుతుల కరతాళధ్వనులందుకున్నారు. అనంతరం రాజకుమారి హృదయమనెడి తలునొద్ద .., యెహోవా నామొరలాలించెను... వంటి గీతాలను మధురంగా గానం చేసి శ్రోతలను అలరించారు. వాయులీనంపై సీహెచ్ ధనుంజయ్, మృదంగంపై హరివంశీ, తబలాపై ధనుంజయ్ పట్నాయక్ లయ వాద్య సహకారం అందించారు. కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు సుధేష్, కార్యదర్శి వి కుమార్‌దాస్, ప్రసన్న, పాల్, మోహనరావు, ఫిలిప్, పీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మోహనరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్‌లు పరిష్కరించాలి
విశాఖపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 18: ఈపీఎస్ పెన్షనర్లు తమ న్యాయమైన కోర్కెల సాధనకు దేశవ్యాప్తంగా ఉద్యమ బాట పట్టారని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి జే కోటేశ్వర రావు అన్నారు. అఖిల భారత ఈపీఎస్ పెన్షనర్ల సమాఖ్య పిలుపుమేరకు లక్ష సంతకాలు సేకరించి, దేశ ప్రధానికి అందజేయాలన్న లక్ష్యంతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెన్షనర్ల ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉద్యమంలో మంగళవారం రెండో రోజు ఓల్డ్‌టౌన్, పీఎం పాలెం, మధురవాడ, ఆదర్శనగర్ ప్రాంతాల్లోని నేవల్ డాక్‌యార్డు, ఆర్టీసీ, సెయిల్, డీసీసీబీ, ఉద్యోగ సంఘ నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కోటేశ్వర రావు మాట్లాడుతూ 1995లో ప్రారంభమైన ఈపీఎస్ లోపభూయిష్టంగా మారిందన్నారు. గరిష్టంగా 45 ఏళ్లు ఉద్యోగం చేసినప్పటికీ నెలకు రూ.2వేలకు పెన్షన్ మించట్లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే పెన్షనర్లను ఆదుకుంటామన్న బీజేపీ ప్రభుత్వం కంటి తుడుపుగా ఉన్నత స్థాయి కమిటీని నియమించి ఊరుకుందన్నారు. సంఘ గౌరవాధ్యక్షుడు బీటీ మూర్తి, అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ కనీస పెన్షన్ రూ.9వేలు డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. పూర్తి వేతనంపై ఈపీఎస్ భాగం, పెన్షన్ విక్రయించుకునే వెసులుబాటు, పెన్షనర్ల కుటుంబాలకు ఈఎస్‌ఐ వర్తింపు అందరికీ అందాలని డిమాండ్ చేశారు. సీబీటీలో ప్రాతినిధ్యం ఉండాలన్నారు. ధర్నాలో సెయిల్ విశ్రాంత అధికారులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఏ నాగరాజు, ఎం రామలింగేశ్వర రావు, దండు నాగేశ్వరరావు, ఎస్ విశే్వశ్వర రావు, డీఆర్ మోహనరావు, జీసీసీ నాయకుడు ఎస్ ఆదినారాయణ, కే సూర్యప్రకాష్, కే సుధాకరరావు పాల్గొన్నారు.