విశాఖపట్నం

గంటా ‘పంచ’తంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: పంచగ్రామాల ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయా? దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని పంచ గ్రామాల సమస్య కొలిక్కి రాబోతోందా? అంటే నిజమేనంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. సింహాచల దేవస్థానం భూములను ఆక్రమించుకుని గృహాలు, దుకాణాలు నిర్మించుకున్న వారు ఎంతో కాలంగా బిక్కుబిక్కుమంటున్నారు. తమ నిర్మాణాలను ప్రభుత్వం ఎప్పటికి రెగ్యులరైజ్ చేస్తుందంటూ ఎదురు చూస్తున్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని, విశాఖలో తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించినప్పుడు పంచ గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమయంలో పంచ గ్రామాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గాన్ని అనే్వషించేందుకు బుధవారం అమరావతిలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సింహాచల దేవస్థానం భూములను ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయద్దంటూ చాలా మంది కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కోర్టులో కేసులు ఇప్పటికిప్పుడు పరిష్కరించే అవకాశం లేదు. ప్రత్నామ్నాయ దిశగా ఈ సమస్యను పరిష్కరించబోతున్నట్టు తెలుస్తోంది.
సింహాచల దేవస్థానంలో అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 ఏప్రిల్ 30వ తేదీ వరకూ అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేశారు. అప్పట్లో 450 ఎకరాల సింహాచల దేవస్థానం భూమిలో అక్రమంగా నిర్మించుకున్న 2400 అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేశారు. ఇందుకు ప్రతిగా సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పుడు కూడా ఇదే పంథాను అనుసరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా రెగ్యులరైజ్ కావల్సిన నిర్మాణాల్లో 100 చదరపు గజాలలోపు ఉన్న ఆక్రమణలను ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 100 చదరపు గజాలకు పైగా ఉన్న స్థలాలను రెగ్యులరైజ్ చేస్తుంది. అయితే వీటికి ఏ ధర నిర్ణయించాలన్నది ప్రభుత్వం నిర్ణయించనుంది. అయితే, ఏ సంవత్సరం వరకూ నిర్మించుకున్న నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తారన్న విషయంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియలో ఏమేరకు దేవస్థానం భూమి పోతుందో, ఆ మేరకు అంతే విలువైన భూమిని ప్రభుత్వం, సింహాచల దేవస్థానానికి ఇవ్వనున్నట్టు కోర్టుకు విన్నవించబోతోందని తెలిసింది. అలాగే, సింహాచల దేవస్థానం భూముల్లో చాల మంది లేఅవుట్‌లు వేశారు. 2008 తరువాత లే-అవుట్‌లపై ఆంక్షలు విధించారు. ఒకవేళ రెగ్యులరైజేషన్ ప్రక్రియకు కోర్టు సుముఖత వ్యక్తం చేస్తే, ఈ లే-అవుట్‌లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? 2009 తరువాత వచ్చిన లే-అవుట్‌లను క్రమబద్దీకరిస్తారా? లేదా? అన్న విషయాన్ని కూడా బుధవారం జరగనున్న సమావేశంలో తేల్చాల్సి ఉంది. అలాగే, రైతుల అధీనంలో ఉన్న భూమిపై ప్రభుత్వం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుంది? దేవస్థానం చేతుల్లో నుంచి భూమి పోకుంటా, ఆ భూమిని రైతులకు కౌలుకు ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గ్రామ కంఠాల విషయానికి వస్తే, అడివివరం గ్రామ కంఠానికి రైతువారీ పట్టా ఇచ్చి, దేవస్థానానికి గతంలో అప్పగించారు. దీనివలన అనేక సమస్యలు తలెత్తాయి. అలా కాకుండా గ్రామ కంఠాలను గ్రామాలకే వదిలేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏదియేమైనా చాలా కాలం తరువాత పంచగ్రామాల సమస్య పరిష్కార దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. మంత్రి గంటా చొరవతో బుధవారం జరగనున్న సమావేశం పంచగ్రామాల ప్రజల కలలు నెరవేర్చేవిధంగా సాగుతుందని భావిద్దాం. ఈ సమస్య పరిష్కారమైతే, భీమిలి, పెందుర్తి, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రజల అండదండలు లభించే అవకాశం లేకపోలేదు.