విశాఖపట్నం

నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: జిల్లా అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలు, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో నిర్ధేశించిన లక్ష్యాలు సాధించాలని సంయుక్త కలెక్టర్ జీ సృజన స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక, ఐఐఎం (లక్నో) బృందంతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా జీడీపీ పెరుగుదలకు పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్, ఆరోగ్యం, విద్య, రవాణా, పర్యాటకం, ట్రైబల్ ఆర్ట్, హెరిటేజ్, ఫార్మా, సినీ పరిశ్రమలు దోహదం చేస్తున్నాయన్నారు. జిల్లాలో అత్యధిక శాతం ఐటీడీఏ పరిధిలో ఉందని, ఇక్కడ కూడా ఐఐఎం బృందం పర్యటించి అభివృద్ధిని పరిశీలించాలన్నారు. కాఫీ పంటను పెద్ద ఎత్తున ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జీసీసీ ఉత్పత్తుల లక్ష్యాలను పెంచి వాటిని సాధించేందుకు అవసరమై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐఐఎం డైరెక్టర్ డాక్టర్ అజిత్‌ప్రసాద్ మాట్లాడుతూ మినిస్టరీ ఆఫ్ కామర్స్, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ సెక్టార్లలో పెరుగుదల రేట్‌కు దేశంలో వారణాసి, ముజఫర్ పూర్‌లతో పాటు విశాఖను ఎంపిక చేశారన్నారు. తమ బృందం ఆయా పట్టణాల్లో పర్యటించి ప్రభుత్వ శాఖల్లో జరగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి భవిష్యత్ ఐదేళ్లలో సాధించాల్సిన ప్రగతిపై పరిశీలించి అంచనాలు రూపొందిస్తామన్నారు. తమ బృందం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా స్టేక్ హోల్డర్ల నుంచి సమాచారాన్ని సేకరించడంతో పాటు గ్రూప్ డిస్కషన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అమలు తీరుపై పరిశీలన జరుపుతామన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలింగరాజు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల శాఖతో పాటు లైవ్‌స్టాక్, అగ్రికల్చరల్, ఫిషింగ్ సెక్టార్లు తోడ్పడుతున్నాయన్నారు. సర్వీస్ సెక్టార్‌కు సంబంధించి ట్రేడ్, రోడ్డు రవాణా, రియల్ ఎస్టేట్, విద్య, వైద్యం, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ఎయిర్ ట్రాన్స్‌పోర్టు రంగాలున్నాయన్నారు. పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్యశాఖ ద్వారా అభివృద్ధి జరుగుతోందన్నారు. ఎంఎస్‌ఎంఈ, స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డు, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్, ఎన్‌ఎండీసీ, పోర్టు వంటివి ఉన్నాయన్నారు. సమావేశంలో జేసీ 2 డాక్టర్ సిరి, ఎల్‌డీఎం శ్రీనాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
* ఆర్కే బీచ్ ర్యాలీలో పాల్గొన్న జేసీ 2 సిరి
విశాఖపట్నం, సెప్టెంబర్ 19: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జేసీ 2 డాక్టర్ ఏ సిరి పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు కళాశాల విద్యార్థులతో స్థానిక ఆర్కే బీచ్ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2018 సెప్టెంబర్ 1న ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశామన్నారు. జాబితాలో పేరు లేని వారితో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఓటరు జాబితాలో తప్పులు, చిరునామాలో మార్పులు, తొలగింపులు వంటి అంశాలను దిద్దుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ర్యాలీలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.