విశాఖపట్నం

అస్తమించిన అరుణ కిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: అమాయకత్వం, దేశ భక్తి తొణికిసలాడుతూ బిడియపడుతూ బడికి వెళ్లే రోజుల నుంచి సమాజాన్ని ఎదిరించి, అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి, అజాత శత్రువుగా నిలిచి, వందేళ్ల ఒంటరి పోరాటాన్ని సాగించిన కమ్యూనిస్ట్ యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ ఇక లేరన్న వార్త అందరిని కలిచివేసింది. కొండపల్లి సీతారామయ్య, కోటేశ్వరమ్మ పేర్లు చెపితేనే కమ్యూనిస్ట్ నేతల రక్తం వేడెక్కుతుంది. మహోద్యమాలు గుర్తుకు వస్తాయి. నిస్వార్థ దంపతులు కళ్లముందు కదలాడతారు. ఓపక్క దేశభక్తి, మరోపక్క సమాజంలోని విపరీత ధోరణులు కొండపల్లి దంపతుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కోటేశ్వరమ్మ జీవితంలో తొంగి చూస్తే, అన్నీ కన్నీటి గాథలే. వందేళ్ల ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న కష్ట నష్టాలను పరికిస్తే, కళ్లు చమర్చక మానవు. ఆమె వందేళ్ళ ప్రస్థానం ఉద్యమాలకే అంకితం చేసి అరుణ కిరణంగా నిలిచిపోయింది. అటువంటి అరుణ కిరణం నేడు అస్తమించింది. నక్సల్స్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య భార్యగా కోటేశ్వరమ్మ చాలా మందికి తెలుసు. కానీ ఆయన ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి నడిపించిన కోటేశ్వరమ్మ కొద్ది మందికే తెలుసు. ముళ్ళబాటలోనే వందేళ్ల జీవితాన్ని సాగించిన కోటేశ్వరమ్మ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి ఈ సందర్భంగా తెలుసుకోవాలి.
కృష్ణా జిల్లా పామర్రులో కోటేశ్వరమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే జాతీయోద్యమ నాయకులు మహాత్మాగాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి అనేక ప్రముఖులను కలుసుకున్నారు. చిన్ననాటి నుంచి పాటలు అంటే ఆమెకు ఇష్టం. బడిలో తోటి విద్యార్థులు ఆట పట్టించినప్పుడు ఆమె పాటే ఆమెకు అండగా నిలిచి ధైర్యంతో ముందుకు నడిపించింది. నాలుగేళ్ల వయసులోనే, అంటే ఊహ తెలియని వయసులోనే కోటేశ్వరమ్మకు వివాహం జరిగింది. ఆమెకు ఎనిమిదేళ్లు వచ్చేనాటి భర్త చనిపోయారు. అప్పట్లో కోటేశ్వరమ్మకు రెండో వివాహం చేయాలనుకున్నా, సమాజంలోని కట్టుబాట్లు అడ్డంకిగా నిలిచాయి. అదే సమయంలో కొండపల్లి సీతారామయ్యతో పరిచయం ఏర్పడింది. అతనితో వివాహం జరిపించాలని పెద్దలు భావించినా, సీతారామయ్యకు తొలుత ముందుకు రాలేదు. ఆ తరువాత పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు జోక్యంతో వీరిద్దరి వివాహం అత్యంత గోప్యంగా జరిగింది. వివాహానికి మునుపే కోటేశ్వరమ్మ గాంధీజీ చేపట్టిన స్వాతంత్రోద్యమంలో అడుగులు వేశారు. ఉన్న కొద్ది పాటి బంగారాన్ని కూడా ఉద్యమం కోసం ఇచ్చేశారు. కమ్యూనిస్ట్ స్కూల్‌లో చదివిన కొండపల్లి సీతారామయ్యతో వివాహం అయిన తరువాత కోటేశ్వరమ్మ జీవితం ప్రజా ఉద్యమ బాట పట్టింది. ఉద్యమం కోసం ఆమె తండ్రి ఇచ్చిన ఆస్తులన్నింటినీ కరగబెట్టారు. ఉద్యమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు కోటేశ్వరమ్మ పత్రికలు కూడా విక్రయించిన రోజులు ఉన్నాయి. సంఘ సంస్కరణ కోసం గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకంలో కూడా కోటేశ్వరమ్మ నటించి మెప్పించారు. నక్సల్స్ ఉద్యమాన్ని నడుపుతున్న సమయంలో సీతారామయ్య అజ్ఞాతంలో ఉన్నప్పుడు కోటేశ్వరమ్మ కుటుంబం అనేక వేధింపులకు గురైంది. ఈ దాడులను తట్టుకోలేక కోటేశ్వరమ్మ రహస్య ఉద్యమంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఆయుధాలను కూడా సరఫరా చేసేవారు.
కొంతకాలానికి కమ్యూనిస్ట్ పార్టీలు రెండుగా విడిపోయాయి. ఇదే సమయంలో సీతారామయ్యతో విభేదాలు రావడంతో కోటేశ్వరమ్మ అతని నుంచి విడిపోవలసి వచ్చింది. సీతారామయ్య నుంచి భరణం కోరకుండానే కొండపల్లి ఇంటిపేరుతోనే ఉండిపోయారు. జీవితమంతా పోరాటంలోనే గడిపోయింది. కుటుంబాన్ని పట్టించుకోలేని పరిస్థితులు. ఆర్థిక ఇబ్బందులు.. కోటేశ్వరమ్మ తన బాధలను అక్షరాలుగా మలుచుకున్నారు. ఏడ్చి ఏడ్చి కన్నీరు కూడా ఇంకిపోయింది. వీటన్నింటినీ తన ఆత్మకథ నిర్జన వారధిలో రాసుకున్నారు కోటేశ్వరమ్మ.