విశాఖపట్నం

దోమల నివారణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 20: విశాఖ ఏజెన్సీలో ప్రబలుతున్న వ్యాధులకు మూలమైన దోమల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి గణపతిరావు కోరారు. పాడేరు పట్టణంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో గురువారం దోమలపై దండయాత్ర ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఎం.పి.డి.ఒ. కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు చేపట్టిన ర్యాలీలో దోమల వలన కలుగుతున్న వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలు నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, దోమల వృద్ధితో అనారోగ్య పరిస్థితులు సంబవిస్తున్నాయని అన్నారు. దోమల వలన వృద్ది చెందుతున్న వ్యాధులను అరికట్టేందుకు ముందుగా దోమలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. దోమల నిర్మూలనపై ఏజెన్సీలో విస్తృతంగా ప్రచారం చేసి గిరిజనులకు సరైన అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. దోమలపై దండయాత్ర పేరుతో నిర్వహిస్తున్న ర్యాలీల వలన ఫలితం వృధాకాకుండా ఉండేందుకు చూడాలని ఆయన సూచించారు. గిరిజన ప్రాంతంలో నివశిస్తున్న ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా అన్ని చోట్ల పారిశుధ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఆయన చెప్పారు. అపారిశుధ్యంతోనే దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ఆయన అన్నారు. దోమల నివారణపై ఇప్పటికైనా దృష్టి సారించాలని గణపతిరావు కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లీలాప్రసాద్, ఎం.పి.డి.ఒ. మధుసూదన్, తాహశీల్ధార్ ప్రకాశరావు, పలు శాఖల అధికారులు, సిబ్బంది, ఎ.ఎన్.ఎం. శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

సాధనతోనే లక్ష్య సాధన
ఎమ్మెల్యే ఈశ్వరి
పాడేరు, సెప్టెంబర్ 20: నిరంతర సాధనతో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెట్విస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన డివిజన్ స్థాయి యువజనోత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన యువతకు అన్ని రంగాలలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థికపరమైన కారణాలతో అణగారిపోతుందని చెప్పారు. గిరిజన యువతను ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో వారు విశేషంగా రాణించి ఈ ప్రాంతానికి ఖ్యాతి తీసుకురాగలరని ఆమె అన్నారు. గిరిజన యువతను ప్రోత్సహించి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి యువజనోత్సవాలను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని ఈశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అప్పారావు, ఎం.పి.డి.ఒ. మధుసూధన్, తాహశీల్ధార్ ప్రకాశరావు, దేశం నాయకులు వంజంగి కాంతమ్మ, బొర్రా నాగరాజు, విజయరాణి, పలువురు అధికారులు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

శ్మశాన వాటిక స్థలం ఆక్రమణ
అరకులోయ, సెప్టెంబర్ 20: స్థానిక వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రి సమీపాన గల శ్మశాన వాటిక స్థలం ఆక్రమణలకు గురికాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సి.పి.ఎం. నాయకుడు కిల్లో సురేంద్ర కోరారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ఈ స్థలం కబ్జాకు గురవుతుందని అన్నారు. నిధులు మంజూరై మూడు నెలలు కావచ్చినా అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడం లేదని ఆయన చెప్పారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన కోరారు.