విశాఖపట్నం

అక్టోబర్ 26న ఆదరణ మెగా మేళా గ్రామదర్శినిలో జిల్లా ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: ఆదరణ రెండో విడత పథకాన్ని ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనిలో భాగంగా భారీ గ్రౌండింగ్ మేళాను అక్టోబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, పంచాయతీ ప్రత్యేకాధికారులతో వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆదరణ పథకానికి సంబంధించి మండలాల వారీగా నిర్ధేశించిన లక్ష్యాల మేరకు దరఖాస్తులను, లబ్దిదారుని వాటా డీడీలను సంబంధిత ధృవీకరణ పత్రాలతో ఆదరణ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఆదరణ యూనిట్ల మెగా గ్రౌండింగ్ మేళాలో వీరందరికీ లబ్దిచేకూరేలా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహణలో జిల్లాను ముందుంచేలా ప్రణాళికాయుతంగా వెళ్లానన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో జిల్లా వెనుకబడి ఉందని, అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామదర్శిని కార్యక్రమం పూర్తయిన తరువాత కార్యక్రమ వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అయితే పలు మండలాల్లోని గ్రామాల్లో అధికారులు ఈ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయట్లేదని, పోర్టల్‌లో అప్‌లోడ్ కానందున గ్రామదర్శిని కార్యక్రమంలో జిల్లా వెనుకబడినట్టు కన్పిస్తోందన్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి పూర్తి కార్యక్రమాన్ని ముందుగానే రూపొందించుకుని ఎప్పటికప్పుడు వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా గ్రామదర్శిని నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని గత కొద్దిరోజులుగా ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా పంచాయతీ ప్రత్యేకాధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో అధికారులు తరచు పర్యటిస్తూ దోమల ఉత్పత్తయ్యే నీటి వనరులను నాశనం చేయాలని, జ్వరాలు ఎక్కువగా ప్రబలే ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడంతో పాటు ఘన వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి షెడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఇంటింటి నుంచి తడి,పొడి చెత్తను సేకరించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తయిన నేపథ్యంలో కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధి పనులకు హాజరవుతారని, అందుకు తగ్గట్టుగానే కూలీలందరికీ పనులు కల్పించేలా చూడాలని, సకాలంలో ఉపాధి కూలీలకు వేతనాలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీఓ బాలాజీ, జేసీ 2 డాక్టర్ సిరి, జేడ్పీ సీఈఓ రమణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

రాఫెల్ కుంభకోణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
ఆరిలోవ, సెప్టెంబర్ 22: దేశంలోనే అతిపెద్ద రక్షణ రంగ కుంభకోణంలో బీజేపీ పాత్రపై నగర కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ శక్తిసంఘటన్ కన్వీనర్ కే గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రోత్సాహంతోనే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో 40వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిననాటి నుంచి అవినీతి పెరిగిపోయిందన్నారు. పాలనా పరంగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దేశాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. అధికారం చేపడితే నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తామని ప్రకటించిన బీజేపీ, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని, విభజన హామీల అమల్లో కూడా రాష్ట్రానికి మొండిచేయి చూపారన్నారు. రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాల్లో పురోగతి లేదన్నారు. ప్రజలను మోసగించిన ప్రధాని మోదీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివకుమార్, దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గీతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రసంగం
ఆరిలోవ, సెప్టెంబర్ 22: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లాను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ వెంకటరమణ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాణించాలంటే ఆంగ్ల భాషపై సమగ్ర అవగాహన, పట్టు అవసరమన్నారు. దేశంలో అనుసరించే వివిధ చట్టాలు, వాటి పూర్వాపరాలను వివరించారు. అస్ట్రేలియాలో చట్టాల క్రోఢీకరణ ప్రక్రియ విద్యార్థులు బాగా అర్ధం చేసుకోవడంలో సహాయ పడుతుందన్నారు. దేశంలో రూపొందించిన న్యాయ సూత్రాలకు మొలం ప్రాచీన వేదాల నుంచి తీసుకున్నదేనన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ లా డైరెక్టర్ ప్రొఫెసర్ వై సత్యనారాయణ మాట్లాడతు సామాజిక బాధ్యత కలిగిన న్యాయవాదులను గీతం ద్వారా అందిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గీతం అంతర కళాశాలల కబడ్డి, హేండ్ బాల్ విజేత జీఐటీ
ఆరిలోవ, సెప్టెంబర్ 22: గీతం అంతర్ కళాశాల పోటీల్లో భాగంగా కబడ్డీ, హేండ్‌బాల్ (పురుష) పోటీల్లో విజేతగా విశాఖ గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టైటిల్‌ను గెలుచుకున్నాయి. శనివారం జరిగిన కబడ్డీ ఫైనల్‌లో గీతం విశాఖ జట్టు బెంగళూరు జట్టుపై 50-39 తేడాతో విశాఖ జట్టు విజయం సాధించింది. శనివారం ప్రారంభమైన హేండ్‌బాల్ పోటీలో గీతం జట్టు హైదరాబాద్ జట్టుపై 11-9 స్కోర్‌తో విశాఖ జట్టు విజయం సాధించిందని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఇన్‌ఛార్జి డైరెక్టర్ కే రామకృష్ణారావు, కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, కోచ్‌లు పాల్గొన్నారు.