క్రైమ్/లీగల్

బంగారం వ్యాపారి కంట్లో కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), సెప్టెంబర్ 23: సీనీ పక్కీ తరహాలో ఓ బంగారం వ్యాపారి కంట్లో కారం జల్లి రూ.32లక్షల నగదు, 1200గ్రాముల బంగారాన్ని మోటారుబైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు అపహరించుకుపోయారు. నగరంలోని డిఆర్‌ఎం కార్యాలయం రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొయ్యంబత్తూరు ప్రాంతానికి చెందిన జె.రమేష్‌బాబు ద్వారకానగర్ సమీపంలోని బుధిల్‌పార్క్ వద్ద గల ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. ఈయన బంగారం వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.42లక్షల నగదు, 1200గ్రాముల బంగారంతో ఉన్న సూట్‌కేసు, బ్యాగ్‌లతో ఆదివారం తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో కొరమండల్ రైలులో కొయ్యంబత్తూరు వెళ్లడానికి డ్రైవర్ సురేష్‌బాబుతో కలిసి యాక్టివ్ హొండపై ద్వారకానగర్ నుండి బయలు దేరాడు. రైల్వేస్టేషన్ రోడ్డులోని డిఆర్‌ఎం కార్యాలయం రోడ్డులో వీరిద్దరు హొండ యాక్టివ్‌పై వెళ్తుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ముగ్గురు గుర్తు తెలియని యువకులు వారి కంట్లో కారం జల్లి వీరి చేతిలో ఉన్న సూట్‌కేసు, బ్యాగ్‌లను లాక్కొని మోటారుబైక్‌పై పారిపోయారు. దీంతో బంగారం వ్యాపారి రమేష్‌బాబు స్థానిక క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన వద్ద సీసీ కెమెరాలను, బైక్‌పై ముగ్గురు ఏఏ రోడ్డులో వెళ్ళారో ఆయా ప్రాంతాల లోని సీసీ పుటేజీలను క్రైం పోలీసులు పరిశీలిస్తున్నారు. వ్యాపారి రమేష్‌బాబు భారీగా నగదు, బంగారం కొయ్యంబత్తూరుకు తీసుకుని వెళ్తున్నట్టు ముందుగానే తెలుసుకుని దొంగలు చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో రమేష్‌బాబుకు పరిచయం ఉన్న వారి వివరాలను సేకరించడమే కాకుండా, నగదు బంగారం తీసుకుని వెళ్తున్నట్టు ముందుగా ఎవరికి తెలిసే అవకాశముందని దిశలో క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిఐ కృష్ణమూర్తి నేతృత్వంలో రెండో పట్టణ క్రైం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.