విశాల్ కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పందెం కోడి’ సినిమా తర్వాత విశాల్ కెరీర్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవనే చెప్పాలి. తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నా తెలుగులో మాత్రం ఇంకా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. సొంతంగా విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌ను స్థాపించి, విభిన్నమైన కథనాలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్‌గా విడుదలైన ‘కథకళి’ చిత్రం తమిళంలో మంచి హిట్‌ను నమోదు చేసుకుంది. ఈనెల 18న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత విశాల్ జాతీయ అవార్డు అందుకున్న మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ‘తుప్పారి వాలన్’ పేరుతో తెరకెక్కే ఈ సినిమాకు నిర్మాత విశాల్. మిస్కిన్ తమిళంతోపాటు తెలుగులోకూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఆయన సినిమాలు చాలావరకు తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇటీవలే ‘పిశాచి’ చిత్రంతో ఆకట్టుకున్న మిస్కిన్ విశాల్ హీరోగా ఓ డిఫరెంట్ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది.