రాష్ట్రీయం

విశ్వనగరంగా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాభాకు తగ్గట్టుగా వౌలిక సదుపాయాలు శిల్పారామం ముఖాముఖీలో మంత్రి కెటిఆర్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 29: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకృషి చేస్తున్నారని ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఐటి నిపుణులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. మెట్రో రెండవదశ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానానికి దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందన్నారు. నిర్దేశించిన గడువులోగా అధికారులు అనుమతి ఇవ్వని పక్షంలో అపరాధ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని జీవో ఇచ్చామన్నారు. రాష్ట్రంలో అధికారులు బాగానే పనిచేస్తున్నారని, పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. నగర శివార్లలో త్వరలో ఫార్మాసిటీని ఏర్పాటు చచేస్తామన్నారు.
అమెరికా అధ్యక్షులు ప్రయాణించే బోయింగ్ విమానానికి సంబంధించిన స్పెర్ పార్ట్స్ హైదరాబాద్‌లోనే తయారవుతాయన్నారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. మూసి నది ప్రక్షాళన కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇంటింటికి రెండు చెత్త బుట్టలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోతలు లేని విద్యుత్ ఇస్తున్నామన్నారు. బిపిఎస్, ఎల్‌ఆర్‌ఎస్ గడువును పొడిగించే విషయమై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మైక్రోసాఫ్ట్ సంస్ధ సహాయంతో డిజిటల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, 2018 నాటికి తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు మంత్రి కె తారకరామారావు ఓపికగా సమాధానం ఇవ్వడమే కాకుండా సందేహాలను నివృత్తి చేశారు.