ఆంధ్రప్రదేశ్‌

ఈసీని కలిసిన వివేకా కుమార్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్యోదోంతంపై ఏపీ ముఖ్యమంత్రి వివిధ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా వున్నాయని, విచారణ నిష్పక్షిపాతంగా జరపాలని ఆమె కోరారు. ఈ మేరకు సీఎం చేసిన ప్రసంగాల క్లిప్పింగులను ఆమె ఈసీ జీకే ద్వివేదికి అందజేశారు. అవసరమైతే తాము కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిని కూడా కలుస్తామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలు తన తండ్రి హత్య కేసును పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు.