హైదరాబాద్
పోలీసుల అదుపులోని నిందితుడి అనుమానాస్పద మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వైజాగ్‌లో మలక్‌పేట పోలీస్ టీం అరెస్ట్
సైదాబాద్, డిసెంబర్ 17: కేసు విచారణ నిమిత్తం వైజాగ్ నగరానికి వెళ్ళిన మలక్‌పేట పోలీస్ బృందం అదుపులో ఉన్న నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో వైజాగ్ పోలీసులు మలక్‌పేట టీంను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మలక్‌పేట డిఎస్ఐ నరేష్, కానిస్టేబుళ్లు బ్రహ్మం, నర్సింహాల బృందం కొన్నిరోజుల క్రితం ఒక చైన్ స్నాచర్‌ను పట్టుకునేందుకు వైజాగ్ వెళ్ళారు. గురువారం చైన్స్నాచర్ను అదుపులోకి తీసుకున్న మలక్‌పేట పోలీసులు అతన్ని తాము బసచేసిన లాడ్జికి తీసుకెళ్ళారు. అయితే లాడ్జిలో వీరు ఉంటున్న రూం నుండి నిందితుడు కిందకు దూకటంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో వైజాగ్ పోలీసులు మలక్‌పేట పోలీస్ బృందాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.