విజయవాడ

మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం ద్వారా చక్కటి పౌష్టికాహారం అందించే మహత్తర కార్యక్రమాన్ని రూపొందించిందని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించే బాధ్యత టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులపై ఉందన్నారు. గురువారం నగరంలోని క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 45,723 పాఠశాలల్లో నమోదు చేసుకున్న 3.61లక్షల మంది ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జనవరి 21నుండి నూతనంగా మార్పు చేసిన పోషక ఆహారం ఇవ్వడం ప్రారంభించామన్నారు. కొత్త తయారీ విధానం, సరికొత్త మెనూ, సరైన పరిమాణంలో పిల్లలకు ఇవ్వాల్సిన ఆహార నిబంధనలన్నీ తూచా తప్పక పాటించాలని ఆదేశించారు. వంట చేసేవారికి కూడా జీతం పెంచామన్నారు. మధ్యాహ్న వేళల్లో తనతో పాటు ఇతర అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి మెనూ అమలు తీరు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏ ఆశయంతో పథకంలో మార్పులు తీసుకువచ్చారో ఆ ఆశయం నెరవేరుతుందన్నారు. అనంతరం ఎంఈఓ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఏంవీ రాజ్యలక్ష్మీ, ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

త్రోబాల్ సీనియర్స్‌లో నిర్మలా విజయకేతనం
పటమట, జనవరి 23: నగరం లోని కృష్ణలంకలో గల ఏపీఎస్ ఆర్‌ఎం హైస్కూల్‌లో జరిగిన 83వ గ్రిగ్ మెమోరియల్ విజయవాడ అర్బన్ సబ్ జోన్ టోర్నమెంట్‌లో సీనియర్ త్రోబాల్ పోటీల్లో నిర్మలా హైస్కూల్ విద్యార్థులు విన్నర్స్‌గా నిలిచారని హెచ్‌ఎం సిస్టర్ ట్రీసా తెలిపారు. ఈ సందర్భంగా సిస్టర్ ట్రీసా విజేతలైన విద్యార్థులను, పీఈటీ ఆనంద్‌ను అభినందించారు.